మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారిని మారుస్తూ ఉత్తరాఖండ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్సోరీ ఎస్‌హెచ్ఓ దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి సుధాకర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముస్సోరి ఎస్‌హెచ్‌వో ప్రవర్తనపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణను సంపూర్ణానంద్ గైరోలా అనే అధికారికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పారుపూడి రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ మీద పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్ ముస్సోరిలోని ఓ హోమ్ స్టేలో రాధా గాయత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్ పోలీసులు అతనిపై మర్డర్ కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి తండ్రి నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీచరణ్‌తో 2025 నవంబర్ నెలలో పెళ్లి జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఇద్దరూ ఇటీవల విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. అయితే జూన్ 15వ తేదీ ముస్సోరిలోని ఓ హోమ్ స్టేలో రాధా గాయత్రి విగతజీవిగా కనిపించారు. అయితే తన కుమార్తె మరణానికి సంబంధించి అల్లుడు శ్రీచరణ్ మీద సుధాకర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రిని శ్రీచరణ్ మానసికంగా వేధించాడని.. ఆమె ఎక్కడికి వెళ్తుందనేదీ తెలుసుకునేందుకు తన బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ అమర్చాడని ఆరోపిస్తున్నారు.అయితే రాధా గాయత్రి కుటుంబసభ్యుల ఆరోపణలను ఖండించారు శ్రీచరణ్. శనివారం సింహాచలం వచ్చిన శ్రీచరణ్ తనపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలని.. నిజమేంటో పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని వెల్లడించారు. హోమ్ స్టేలోచెప్తున్నారు. అయితే రాధా గాయత్రికి మద్యం సేవించే అలవాటు లేదని.. అలాగే శ్రీచరణ్ చెప్తున్నట్లు ఆమెకు లోబీపీ కూడా లేదని రాధా గాయత్రి కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్తున్నారు. రిషికేష్ వెళ్తున్నట్లు చెప్పారే కానీ.. ముస్సోరిలో రూమ్ తీసుకుంటున్నట్లు సమాచారం ఇవ్వలేదంటున్నారు. పరారీలో శ్రీచరణ్.. మరోవైపు విశాఖపట్నంలో తాను బస చేసిన ప్రదేశం నుంచి శ్రీచరణ్ పరారయ్యాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అటు ముస్సోరిలో పరిస్థితులను శ్రీచరణ్ తనకనుగుణంగా చక్కబెట్టుకుని, వాస్తవాలను తప్పుగా చిత్రీకరించాడని ఉత్తరాఖండ్ పోలీసులు పేర్కొంటున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేథ్ సుధాకర్‌కు హామీ ఇచ్చారు.