HDFC NFO: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) నుంచి మరో కొత్త స్కీమ్ వచ్చింది. () పేరుతో న్యూ ఫండ్ ఆఫర్‌ లాంచ్ చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఆటోమోటివ్ సెక్టార్‌లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ దీర్ఘకాలంలో మూలధన లాభాలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు ఏఎంసీ తెలిపింది. మరి ఈ కొత్త ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ తేదీలు, కనీస పెట్టుబడి వంటి వివరాలు తెలుసుకుందాం. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 22, 2026 సోమవారం నుంచే మొదలవుతోంది. ఇన్వెస్టర్లు ఈ ఇనీషియల్ ఆఫరింగ్‌లో జులై 3, 2026 పాల్గొనవచ్చు. కనీస యూనిట్ ధరను రూ. 10గా నిర్ణయించారు. దేశంలోని ఆటో మొబైల్, ఆటో కాంపోనెంట్స్ ఇండస్ట్రీలను ట్రాక్ చేస్తూ పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫండ్ డిజైన్ చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తెలిపింది. ఈ ఫండ్ మేనేజర్లుగా నందితా మెనేజెస్, అరుణ్ అగర్వాల్ ఉంటారని తెలిపింది. ఈ సబ్‌స్క్రిప్షన్ సమయంలో కనీస పెట్టుబడి రూ. 100గా నిర్ణయించారు. ఆ తర్వాత రూ. 100 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూ. 100గా నిర్ణయించారు. నెట్ అసెట్ వాల్యూ రూ. 10గా నిర్ణయించారు. యూనిట్ల ట్రాన్స్‌ఫర్ పై 0.015 శాతం స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఇందులో ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ ఏమీ లేదు. ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, ఎప్పుడైనా విక్రయించవచ్చు. మరోవైపు.. ఈ ఫండ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఏఎంసీ వద్ద రూ.9.06 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నాయి. గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులకు ఫండ్స్ లోనవుతుంటాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కథనం కేవలం సమచారం ఇచ్చేందుకే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. మరోవైపు కొత్తగా లోకి ఎంట్రీ అవుతున్నవారు న్యూ ఫండ్ ఆఫర్స్ జోలికి వెళ్లకూడదని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు.