మహిళలకు శుభవార్త- 3 రోజుల్లోనే రూ. 6650 తగ్గిన బంగారం ధర.. వెండి రూ. 25 వేలు పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే

Wait 5 sec.

: అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు పెరుగుతున్నాయి. తమ లక్షిత పరిధి కంటే ఎక్కువగానే ద్రవ్యోల్బణం నమోదవుతున్న తరుణంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను సమీప భవిష్యత్తుల్లో పెంచొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల కిందట యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచినా సెప్టెంబరులో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే యూఎస్ డాలర్, బాండ్లకు గిరాకీ పెరిగి బంగారం ఆకర్షణ కోల్పోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కారణంతోనే వరుసగా భారీగా పతనం అవుతున్నాయి. వరుస సెషన్లలో తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు ఊరట దక్కుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో, దేశీయంగా కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 7 నెలల కిందటి స్థాయిలకు పడిపోయాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి. అంటే గతేడాది నవంబరులో ఉన్న ధరల స్థాయికి పడిపోయాయన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే చాలా కాలం తర్వాత స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కు దిగువకు చేరి ట్రేడవుతోంది. ప్రస్తుతం జూన్ 26న ఉదయం 8 గంటల సమయంలో గోల్డ్ రేటు ఔన్సుకు 3990 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇంకా 3970 డాలర్ల మార్కుకు కూడా పడిపోయింది. సిల్వర్ రేటు 56 డాలర్ల స్థాయిలో ఉంది. మరోవైపు రూపాయి మారకం విలువ డాలరుతో చూస్తే రూ. 94.40 వద్ద కొనసాగుతోంది. 3 రోజుల్లో రూ. 6 వేలకుపైగా పతనం (Gold Rate Today)దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1450 తగ్గగా 10 గ్రాములకు రూ. 1,29,550 వద్దకు చేరింది. కిందటి రోజు ఒక దశలో మరింత తగ్గి రూ. 1,28,500 మార్కుకు కూడా పడిపోయింది. గత 3 రోజుల్లో చూస్తే వరుసగా రూ. 3100, రూ. 1550, రూ. 1450 ఇలా రూ. 6100 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ. 1580 తగ్గి తులం రూ. 1,41,330 వద్దకు చేరింది. ఇది 3 రోజుల్లో రూ. 6650 పతనమైంది. భారీగా తగ్గుతున్న వెండి ధర (Silver Rate Fall)బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు రూ. 10 వేల పతనంతో కేజీకి హైదరాబాద్ మార్కెట్లో రూ. 2.30 లక్షలకు చేరింది. గత 3 రోజుల వ్యవధిలోనే చూస్తే రూ. 25 వేలు తగ్గుముఖం పట్టింది.గమనిక: ఇవి ఉదయం 8 గంటలలోపు ధరలు అని గమనించాలి. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాత బంగారం ధరలు మారుతుంటాయి. గమనించగలరు.