2026లో భారత జట్టుకు షాక్ తగిలింది. ఉత్కంఠ భరితంగా సాగిన తాజా విజయంతో సౌతాఫ్రికా తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కానీ ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా గ్రూప్-ఏలో ఉన్నాయి. పాయింట్స్ టేబుల్‌లో ఇప్పుడు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, సౌతాఫ్రికాల్లో కేవలం ఒక్క జట్టు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉంది.భారత్ సెమీస్ చేరగలదా?భారత్ ఈ టోర్నీలో మిగిలిన లీగ్ స్టేజ్‌లో జూన్ 25న బంగ్లాదేశ్‌, జూన్ 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. సౌతాఫ్రికా చేతిలో ఓడినా.. టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ టేబుల్‌లో భారత్ ఇప్పటికే రెండో ప్లేసులో ఉంది. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచులలో తప్పకుండా గెలవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ 2.511, దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ కంటే -0.546 మెరుగ్గా ఉంది.ఒకవేళ టీమిండియా తన తదుపరి రెండు మ్యాచులలో ఒకదాంట్లో ఓడిపోతే.. సెమీస్ అవకాశాలు దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచులలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందులో ఒక దాంట్లో ఆ జట్టు ఓడిపోతే భారత్ ముందంజ వేసే అవకాశం ఉంది. అలా కాకుండా భారత్.. ఆసీస్ చేతిలో ఓడిపోయి.. ప్రొటీస్ జట్టు రెండింట్లోనూ గెలిస్తే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటాయి.ఇక గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఆ రెండు జట్లూ ఆడిన మూడు మ్యాచులలోనూ ఓడిపోయాయి. ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా 3 మ్యాచులలో 3 విజయాలు, +4.391 నెట్ రన్ రేట్‌తో టేబుల్ టాపర్‌గా ఉంది.