"నా కూతురే హంతకురాలైతే వదలొద్దు.. అదే కోట నుంచి తోసేయండి" సియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కుటుంబ సభ్యులు తొలిసారి స్పందించారు. కేతన్ హత్యపై సియా తండ్రి ప్రవీణ్ గోయెల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్‌ను సొంత కొడుకుగా భావించామని.. అలాంటిది ఇలా జరగడాన్ని అస్సలు తీసుకోలేకపోతున్నామన్నారు. ఒకవేళ ఈ కేసులో తన కూతురు హంతకురాలైతే అదే కోట నుంచి తోయేండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "జరిగింది చాలా విషాధకర సంఘటన. ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము. కేతన్ వాళ్ల కుమారుడే కాదు.. మాకూ కుమారుడు లాంటోడు. కొద్ది కాలంలోనే అతనితో ఎంతో అనుబంధం ఏర్పడింది. ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాం. ఇప్పుడు అవన్నీ కూలిపోయాయి. నా కూతురే దోషి అయినా కఠిన శిక్ష వేయండి. హంతకులకు అత్యంత కఠిన శిక్ష పడాలి. కేతన్ పడిపోయిన అదే కోటపై నుంచి నిందితులను తోసేయాలి. అది నా కూతురు అయినా సరే" అని సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయాల్ తీవ్ర ఆవేదనతో అన్నారు. కేతన్ హత్య విషయంలో సియా గోయల్ తల్లి కూడా స్పందించారు. కేతన్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. "ఈ వార్త విన్నాక తీవ్ర షాక్‌కు గురయ్యాను. కేతన్ చాలా మంది అబ్బాయి. ఇది జరగడంతో రెండు కుటుంబాలు నాశనమయ్యాయి. నా కూతురే దోషి అని తేలితే ఆమెకూ కఠిన శిక్ష పడాలి. కేతన్‌ను తోసిన చోటే ఆమెను కూడా తోసేయాలి" అని కన్నీటి పర్యంతమయింది. ఈ కేసు గురించి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సియా గోయల్ - చేతన్ చౌదరి ఇద్దరూ రిలేషన్‌లో‌ ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే కేతన్‌తో సియా నిశ్చితార్థం జరిగింది. జూన్ 18న మహారాష్ట్రలోని లోహగడ్ కోటకు వెళ్లిన సమయంలో ఓ పక్కా ప్రణాళిక ప్రకారమే కేతన్‌ను హత్య చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సియా - చేతన్ మధ్య ఘటనకు ముందు నెలలోనే 2 వేలకు పైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్య ఎలా చేయాలి అనే అంశాలపై ఇంటర్నెట్‌లోనూ సెర్చ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో పోలీసులు ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దర్నీ అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.