ITR Filing: వ్యక్తిగత చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను ఫైల్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐటీఆర్ ఫైలింగ్‌కు సమయం ఆసన్నమైంది. అయితే, సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోకపోవడం, మూలధన లాభాలను తప్పుగా నమోదు చేయడం, పాత కంపెనీలు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాలను చూపకపోవడం, బ్యాంక్ అకౌంట్ల వివరాలు చెప్పకపోవడం, అద్దె ఆదాయం, వడ్డీలు, పన్ను మినహాయింపుల వంటి వి సరిగ్గా చూపించకపోవడం చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. దీంతో ఐటీ నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను రీఫండ్లు ఆలస్యమవుతుంటాయి. మరి లో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. ఆస్తుల వివరాలు సరిగ్గా వెల్లడించకపోవడం2026-27 మందిపు సంవత్సరానికి ట్యాక్స్ పేయర్లు చేసే అతిపెద్ద పొరపాటు విదేశీ ఆస్తులను సరిగ్గా వెల్లడించకపోవడమే అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం లేదా విదేశీ ఆస్తులు కలిగి ఉండటం గణనీయంగా పెరిగింది. కానీ, చాలా మంది తమ విదేశీ ఆస్తులను, పెట్టుబడులను రిటర్నుల్లోని షెడ్యూల్ ఎఫ్ఓ లో వివరాలు సరిగ్గా వెల్లడించడంలో విఫలమవుతారు. ఏఐపై ఆధారపడడంప్రస్తుత రోజుల్లో ఎలాంటి నిపుణుల సహాయం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఉపకరణాల ద్వారా సులభంగా రిటర్నులు ఫైల్ చేశామని కొందరు చెబుతుండడం వినే ఉంటారు. ఇలాంటివి వాడకం ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, రిటర్నుల ఫైలింగ్ లాంటి చట్టపరమైన, తప్పనిసరి ప్రక్రియల కోసం వాటిని పూర్తిగా విశ్వసించే స్థాయికి చేరుకోలేదు. కేవలం ఒకటి లేదా రెండు ఆదాయ వనరులు ఉండి, మూలధన లాభాలు, నష్టాలు లేనివి అయితే కొంత సహాయం దొరకవచ్చు. కానీ, సులభమైన రిటర్నులు సమర్పించేందుకు ఐటీ శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ఎంతో సురక్షితమైంది. అందులో ఆదాయ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కాబట్టి వాటిని సరిచూసుకుని, సులభంగా ఫైల్ చేయడం మంచిది. నిపుణులను సంప్రదించకపోవడంఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఏయే వివరాలను, ఎలా పొందుపరచాలో స్పష్టంగా తెలియకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కొందరు ఫీజులు ఆదా చేయాలనే లక్ష్యంతో సొంతంగా ఐటీఆర్ సమర్పించే ప్రయత్నం చేస్తారు. కొందరు రూల్స్ తమకు అనుకూలంగా అన్వయించుకుని తప్పులు చేస్తారు. సొంతంగా రిటర్నులు ఫైల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చట్టం, రూల్స్ పై అవగాహన లేకుండా ఫైల్ చేస్తే నోటీసులు రావచ్చు. ప్రధానంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాలు ఉన్నవారు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. సరైన ఆధారాలు లేకుండాసరైన ఆధారాలు లేకపోవడం అనే పొరపాటు కొత్తదేమీ కాదు. గతంలో చాలా మంది హౌస్ రెంట్ అలవెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రాజకీయ విరాళాల వంటి మినహాయింపులకు ఎలాంటి సరైన ఆధారాలు లేకుండానే క్లెయిమ్ చేస్తారు. కానీ, పరిస్థితులు మారాయి. ఐటీ శాఖ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ రిటర్నుల్లో, ఆదాయంలో వ్యత్యాసాలను పసిగట్టి, నోటీసులు పంపుతోంది. పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే సమయంలో సరైన డాక్యుమెంట్లను, బిల్లులను భద్రపరుచుకోవడం తప్పనిసరి.