దిగ్గజ రైల్వే సంస్థలో మరోసారి వాటా విక్రయిస్తున్న కేంద్రం.. ఒక్కో షేరు రూ. 91 కే.. ఖజానాకు వేల కోట్లు

Wait 5 sec.

: భారతీయ రైల్వేకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (PSU) ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌లో (IRFC) కేంద్ర ప్రభుత్వం మళ్లీ వాటా విక్రయిస్తోంది. ఇప్పటికే ఈ ఇప్పుడు మళ్లీ 2 శాతం మేర వాటా విక్రయం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలోనే ఉండనుంది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు జూన్ 24న (బుధవారం) ఇక్కడ ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను కొనుగోలు చేయొచ్చు. గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు వంటి వాటిల్లో వాటాల్ని విక్రయిస్తూ వస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగానే ఐఆర్ఎఫ్‌సీలో ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయిస్తోంది. ఇక్కడ మొత్తం 2 శాతం వాటాను ఒకేసారి కేంద్రం విక్రయించట్లేదు. ముందుగా ఒక శాతం ఈక్విటీ వాటాను అందుబాటులో ఉంచుతుంది. మరో ఒక శాతం వాటాను గ్రీన్ షూ ఆప్షన్ లేదా ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కింద ఉంచనుంది. అంటే రెస్పాన్స్ బాగుంటే ఆ ఒక్క శాతం వాటా కూడా విక్రయిస్తోందని స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయం కోసం ఒక్కో షేరు ధరను (ఫ్లోర్ ప్రైస్) రూ. 91 గా నిర్ణయించింది. ఇది కిందటి రోజు (మంగళవారం) క్లోజింగ్ ధర రూ. 98.37 తో చూస్తే దాదాపు 8 శాతం డిస్కౌంట్‌కే ఆఫర్ చేస్తుండటం విశేషం. మొత్తం 26.13 కోట్ల ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ కోసం ఐఆర్ఎఫ్‌సీ అందుబాటులో ఉంచింది. పూర్తి స్థాయిలో సబ్‌స్క్రిప్షన్ జరిగితే ప్రభుత్వ ఖజానాకు రూ. 2300 కోట్ల వరకు నిధులు చేరతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఆర్ఎఫ్‌సీలో కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు 86.4 శాతంగా ఉంది. అయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనల ప్రకారం లిస్టింగ్ కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం 25 శాతంగా ఉండాలి. దీంట్లో భాగంగానే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం ఇటీవల వాటాల్ని విక్రయిస్తూ వస్తోందని చెప్పొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ సహా ఆస్తుల నగదీకరణతో ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 80 వేల కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 5 పీఎస్‌యూలు కోల్ ఇండియా, NHPC, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NLC ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 16 వేల కోట్లకుపైగా నిధుల్ని సమీకరించింది.