‘సిగ్గుతో తల వంచుకోవాలి’.. ‘ఇడుపు కాయితం’ వివాదంపై నటుడు నరేష్ కామెంట్స్

Wait 5 sec.

ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్‌ పై కొందరు కావాలని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. దీనిపై తాజాగా సీనియర్‌ నటుడు వీకే నరేష్ స్పందించారు. ‘ఇడుపు కాయితం’ వివాదాన్ని జాతీయ సమస్య చేశారని నరేష్ అన్నారు. దీన్ని వివాదంగా మార్చినందుకు మనందరం సిగ్గు పడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాండలికాన్ని అవమానించొద్దని, సినిమాను సినిమాగానే చూడాలని హితవు పలికారు. ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పదాల అర్థాలు తెలియకపోయినా ఆయా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించి, తెలుగు భాషను కాపాడుకుందామని పేర్కొన్నారు. దయచేసి మన తెలుగు భాషా మాండలికాలను తక్కువ చేయడం లేదా అవమానించడం మానేయండి అంటూ నరేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు.