‘హైదరాబాద్‌ నుంచి ఆంధ్రావాళ్లు వెళ్లిపోవాలని పోస్టులు పెట్టడం కాదు.. ఈ పని చేయండి’: జబర్దస్త్ మహిధర్

Wait 5 sec.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆంధ్ర vs తెలంగాణ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాది భాష తెలంగాణ అని కొందరు అంటే.. తెలంగాణ యాసను ఎక్కిరిస్తూ పోస్టులు వేసిన వారు కొందరు. దీంతో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య పోరు ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన . ఆత్మగౌరవం అంటూ తెలంగాణ నెటిజన్లు.. తమను అంటే ఊరుకుంటామా అని ఆంధ్రా నెటిజన్లు పోటాపోటీగా పోస్టులు చేస్తుండటంతో.. వ్యవహారం చేయి దాటే పరిస్థితి కనిపిస్తోంది. హితబోధ చేసి, మనమంతా తెలుగు వాళ్లమేనని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. మళ్లీ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇరు వైపులా ఎవరికి వారు భావోద్వేగంతో స్పందిస్తున్నారని.. ఇలా చేయకుండా సంయమనం పాటించాలని కొందరు కోరుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ మహిధర్‌ యూట్యూబ్‌లో చేసిన ఓ వీడియో దుమారం లేపింది. ‘హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్ల ఆస్తులన్నీ అమ్మితే.. కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ల దగ్గర అంత డబ్బుందా పోనీ.. సిద్ధంగా ఉన్నారా పోనీ.. ఇట్ల అమ్ముతారు బై.. ఇట్ల నెక్స్ట్ మినిట్ చెప్పిన రేటుకు సూట్ కేసులు తెచ్చి ముందు పెడతారా’ అంటూ మహిధర్ మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. మహిధర్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రాంత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరైతే ఈ బలుపు మాటలు బందుపెడితే మంచిదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, కాంట్రవర్సీకి అవకాశం ఉండటంతో జబర్దస్త్ మహిధర్ స్పందించారు. వెంటనే ఈ వీడియోను ఎవరికీ కనిపించకుండా యూట్యూబ్‌లో ప్రయివేట్‌ మోడ్‌లో పెట్టారు. ఈ మేరకు మరో వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేసే ఆలోచన లేదన్న మహిధర్.. ఆ వీడియోను ఎవరైనా అప్‌లోడ్ చేస్తే కాపీ రైట్ నోటీసులు పంపిస్తానన్నారు. తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తన మాటలు కరెక్ట్ కాదని చాలా మంది చెప్పారని.. దాన్ని అంగీకరించి, తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు.అయితే తన మాటల వెనుక ఉద్దేశం వేరేనని మహిధర్ వెల్లడించారు. ‘‘ఏదైనా గొడవ జరిగి, ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే ఇష్యూ వచ్చిన ప్రతిసారీ.. ఆంధ్రా వాళ్లంతా ఆంధ్రాకు దె*గేయడని అంటుంటారు. ఆ మాటలు అనే వారిని మాత్రమే నేను అన్నాను. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కర్నీ అనలేదు. ఈ మాట అనేది తెలంగాణ పౌరులే కదా. వాళ్లను ఉద్దేశించే నేను ఆ మాట అన్నాను. ఆ మాటను కూడా వెనక్కి తీసుకుంటున్నాను’’ అని ఆయన తెలిపారు.‘‘హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లు ఆంధ్రాకు దె*గేయండని అనాలని అనుకుంటే.. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం కాదు. దయచేసి తెలంగాణ హైకోర్టుకు వెళ్లి.. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువ ఉన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. తెలంగాణలో, హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలి. ఆంధ్రా వాళ్లు ఉండొద్దు.. వేరే రాష్ట్రాల వాళ్లు ఉన్నా ఫర్వాలేదు అనుకుంటే అలా చెప్పుకోండి. లేదా వేరే రాష్ట్రాల వాళ్లు ఎవరూ వద్దనుకుంటే.. ఎవరూ ఉండొద్దని చెప్పి తెలంగాణ హైకోర్టు నుంచి ఒక నోటీసు తీసుకొని వచ్చి చెప్పండి. కొంత మంది వ్యక్తులు చేసిన తప్పును రాష్ట్రం మొత్తానికి ఆపాదించి.. ఆంధ్రా ప్రజలందరూ ఇంతే.. ఆంధ్రాను సౌత్ బిహార్ అనేది ఇందుకే.. ఇలాంటి మాటలు అన్నందుకే నేను రియాక్ట్ అయ్యాను. అది మీకు తప్పు అనిపిస్తే.. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటనేది అర్థం చేసుకోండి’ అంటూ మహిధర్ వ్యాఖ్యానించారు.ఆయన ముందుగా మాట్లాడిన వీడియోను ప్రయివేట్ మోడ్‌లో పెట్టినప్పటికీ, వివరణ ఇచ్చినప్పటికీ.. ఎక్స్‌లో మాత్రం ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ అవుతూనే ఉంది.