రూ.15 లక్షల శాలరీ ఉంటే.. కంపెనీ ఎంత TDS కట్ చేస్తుంది? పాత Vs కొత్త పన్ను విధానాల లెక్కలు ఇవే!

Wait 5 sec.

: ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగిపై కంపెనీ చేసే ఖర్చు మొత్తం లెక్కించి శాలరీ ప్యాకేజీ (CTC) నిర్ణయిస్తారు. అందులోంచి ప్రావిడెంట్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ సహా ఇతర కట్టింగ్స్ ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితుల ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే శాలరీ ప్యాకేజీ ఉన్నట్లయితే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) అనేది కట్ చేస్తారు. శాలరీతో పాటు బోనస్, అలవెన్సులు, ట్యాక్స్ పరిధిలోకి వచ్చే గిఫ్టుల వంటి వాటిపై టీడీఎస్ కట్ చేస్తారు. అయితే, ఇది ప్రతి ఉద్యోగికి ఒకే విధంగా ఉండదని గుర్తుంచు కోవాలి.ఉదాహరణకు ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి వేతన ప్యాకేజీ రూ. 15 లక్షలుగా ఉందని అనుకుందాం. అప్పుడు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం చూసుకున్నా సదరు ఉద్యోగి పన్ను పరిధిలోకి వస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు సహా ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారు ప్రతి ఏడాది జులై 31 వ తేదీ లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రతి నెలా కట్ చేసే టీడీఎస్‌ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైలింగ్ ఒక్కటే మార్గం. మరి రూ. 15 లక్షల కొత్త, పాత పన్ను విధానాల ప్రకారం అంచనా లెక్కలు ఓసారి తెలుసుకుందాం. రూ.15 లక్షల వేతనంలోని అంశాలుపాత పన్ను విధానంకొత్త పన్ను విధానంబేసిక్ శాలరీరూ.5,62,500రూ.5,62,500డీఏరూ.1,87,500రూ.1,87,500ఇతర శాలరీ కాంపోనెంట్స్రూ.7,50,000రూ.7,50,000గ్రాస్ పేరూ.15,00,000రూ.15,00,000స్టాండర్డ్ డిడక్షన్రూ.50,000రూ.75,000చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్రూ.72,000-హాస్టల్ ఖర్చు అలవెన్స్రూ.2,16,000-పన్ను పరిధిలోకి వచ్చే శాలరీరూ.11,62,000రూ.14,25,000సెల్ప్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ నుంచి నష్టంరూ.2,00,000-సెక్షన్ 80సీ డిడక్షన్రూ.1,50,000-సెక్షన్ 80సీసీడీ(2)రూ.75,000రూ.1,05,000సెక్షన్ 80సీసీడీ (1బీ)రూ.50,000-సెక్షన్ 80డీ హెల్త్ ఇన్సూరెన్స్రూ.50,000-నెట్ ట్యాక్సేబుల్ శాలరీరూ.6,37,000రూ.13,20,000మొత్తం కట్టాల్సిన పన్నురూ.41,500రూ.81,120నెలకు కట్ అయ్యే టీడీఎస్రూ. 3,458రూ. 6760