చీపెస్ట్ కార్ లోన్స్.. SBI, HDFC సహా ఏ బ్యాంకులో రూ. 5 లక్షలపై ఐదేళ్లకు నెలకు ఈఎంఐ ఎంత?

Wait 5 sec.

: కొత్తగా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య కొంత కాలంగా విపరీతంగా పెరుగుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా మార్కెట్లోకి అందుబాటు ధరల్లో పోటాపోటీగా కొత్త కార్లు వస్తుండటం, జీఎస్టీ తగ్గించడంతో కార్ల ధరలు తగ్గడం, అవసరాలు పెరగడం ఇలా చాలా కారణాలే ఉన్నాయి. దీంతో ఇంట్లో ఒక్క కారైనా ఉండాలన్నట్లుగా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లు ప్రకటిస్తుండటం, ఇతర ఆఫర్లు తీసుకొస్తుండటం ఇలా చాలా అంశాలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇంకా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి కార్ల తయారీ సంస్థల సేల్స్ కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక కొత్త కార్లు కొనాలనుకుంటే బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు, ఆర్థిక కంపెనీలు లోన్స్ ఇస్తుంటాయి. ఆర్బీఐ రెపో రేట్లను గతేడాది భారీగా తగ్గించగా లోన్లపై వడ్డీ రేట్లు మరీ పెద్దగా ఏం లేవు. ఇంకా ఇతర పర్సనల్ లోన్ కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. జూన్ నెలలో కనీసం 7.35 శాతం నుంచి కూడా కార్ లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో కార్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. దేంట్లో ప్రాసెసింగ్ రుసుములు ఎలా ఉన్నాయి.. ఈఎంఐ ఎంత పడుతుందో చూద్దాం. ఈఎంఐ అనేది రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే.. ఐదేళ్ల కాల వ్యవధికి చూస్తే నెలకు ఈఎంఐ ఎంత ఉంటుందో తెలుసుకుందాం. యూకో బ్యాంకులో అన్నింటికంటే తక్కువగా కనీసం 7.35 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతుండగా గరిష్టంగా 10 శాతంగా ఉంది. మెరుగైన క్రెడిట్ స్కోరు, స్థిర ఆదాయం ఉంటే కనీస వడ్డీ రేటుకే లోన్ పొందే వీలుంటుంది. ఇక్కడ 5 లక్షలపై ఐదేళ్లకు చూస్తే ఈఎంఐ నెలకు రూ. 9983- 10624 మధ్య పడుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5 శాతం వరకు ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.80-9.85 శాతం మధ్య కార్ల రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈఎంఐ రూ. 10331-10587 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 1500- 4 వేల మధ్య ఉంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి ప్రారంభమవుతుండగా 5 లక్షలపై ఈఎంఐ రూ. 10,174 నుంచి పడుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ రుసుము రూ. 3500- రూ. 8 వేల మధ్య ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో 8.40 శాతం నుంచి మొదలవుతుండగా ఈఎంఐ రూ. 10,234 నుంచి మొదలవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 7.60-10.70 శాతంగా వడ్డీ రేట్లు ఉండగా ఈఎంఐ రూ. 10043-10797 మధ్య ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.50-10 శాతంగా ఉండగా ఈఎంఐ రూ. 10019- 10684 గా ఉంటుంది.గమనిక: పైన ఇచ్చినవి ప్రారంభ, గరిష్ఠ వడ్డీ రేట్లు మాత్రమే. రుణ గ్రహీత ఆదాయం, క్రెడిట్ స్కోరు, లోన్ తీసుకునే మొత్తం ఆధారంగా వడ్డీ రేట్లలో తేడాలు ఉండొచ్చు గమనించగలరు.