Mutual Fund Tips: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టలేని వారు, మార్కెట్‌పై సరైన అవగాహన లేని వారు హైరిటర్న్స్ కోసం ఎంచుకుంటున్నారు. గడిచిన పది సంవత్సరాల కాలంలో చూసుకుంటే చాలా ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (AUM) భారీగా పెరిగాయి. లక్షల మంది కోట్లాది రూపాయలు ప్రతి నెలా కుమ్మరిస్తున్నారు. అయితే, చాలా మంది తెలిసినవారు చెప్పారని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, పెట్టుబడి చిట్కాలను చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఎంయూ విలువ ఎక్కువ ఉన్న ఫండ్స్, ఇలా చేయడం మంచిదేనా? అనే ప్రశ్నకు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. అది తెలుసుకుందాం. ప్రశ్న: యూట్యూబ్ వంటి సోషల్ మీడియాల్లో సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలంటే ఆ ఫండ్‌కి ఏయూఎం ఎక్కువ ఉండాలని, ఏయూఎం ఎక్కువ ఉంటేనే ఆ ఫండ్స్ హైరిటర్న్స్ ఇస్తుందని చెబుతుంటారు. ఆ ఫండ్ గురించి తెలుసుకునేందుకు మనకు ఉండే యాక్సెస్ వేరు. ఫండ్ మేనేజర్స్, ఫండ్ పరిధిలోని ఆస్తులు, పెట్టుబడి స్టాక్స్ వంటివి మాత్రమే తెలుస్తాయి. అయితే, ఇలా నంబర్ వన్ ఫండ్ అని ఎంచుకోవడం మంచిదేనా?సమాధానం: మ్యూచువల్ ఫండ్స్ అంటే అనుభవం లేకుండా, ఆపరేషనల్ విషయం తెలియకుండా ఈ కాలంలో యూట్యూబ్‌లో పిచ్చి పిచ్చిగా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెబుతున్నారు. వాళ్లు ఎప్పుడూ ఫండ్స్ విక్రయించలేదు. వాళ్లు ఎప్పుడూ కనీసం ఒక అప్లికేషన్ సైతం నింపలేదు. వారికి ఏమీ తెలియదు. కేవలం ఇంటర్నెట్‌లో ఉండే సమాచారం తీసుకుని అది మంచిదని చెబుతారు. దాని ఏయూఎం పెద్దగా ఉందా, ఎక్స్‌పెన్స్ రేషియో ఇంత ఉందా అని చెప్పేస్తారు. వాళ్లకు ఏమీ తెలియదు. దానిని పట్టుకుని డైరెక్ట్ ఇన్వెస్టర్లు లేదా మా వద్దకు వచ్చే వారు కావచ్చు లక్ష మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చెప్పాడని అంటుంటారు. కానీ, అతను నిజమే చెబుతున్నాడా అని ఆలోచించరు. అసలు అతనికి ఏమీ తెలియదు. ఫండ్ పెద్దదా చిన్నదా అని చూస్తే పెద్ద ఫండ్ అయితే ఆ ఫండ్ మేనేజర్‌కి ఉన్న బాధలు తెలుసుకోవాలి. పెద్ద ఫండ్ కాబట్టి సమస్యలూ పెద్దగానే ఉంటాయి. అలాగే ఒక కుందేలు మాదిరిగా ఏనుగు వేగంగా పరుగెట్టలేదు. ఫండ్ పెద్దగా అయితే ఏనుగు లాగా మూమెంట్ ఉంటుంది. మీడియం, స్మాల్ సైజ్ ఉన్నట్లయితే అది వేగంగా పరిగెట్టగలదు. ఎందుకంటే దాని సైజ్ అనుకూలంగా ఉంటుంది. అదే క్రమంలో ఒక పోర్ట్ ఫోలియో బియాండ్ అయితే అది పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లక్ష కోట్ల ఏఎంయూ ఉందనుకుందాం. వారు 40-50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ స్టాక్‌కి కార్పొరేట్ గవర్నెన్స్ సమస్య వస్తే, రెగ్యులేటరీ ఇష్యూ వస్తే, ఆ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్‌ని విక్రయించలేడు. లిక్విడిటీ ఎక్కువగా ఉండదు. ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి ఉండదు. నంబర్ 1 లార్జ్ క్యాప్, నంబర్ 1 మిడ్ క్యాప్, నంబర్ 1 స్మాల్ క్యాప్ అని అన్నీ అలాగే ఎంచుకుంటారు. అలా ఆలోచించడమే తప్పు. నంబర్ 1 ఫండ్ ఎంచుకుంటే ఆ ఫండ్ మేనేజర్ ‌కి ఉన్న బాధలు మీకు తెలియవు. ఇంతకు ముందు ప్రతి నెలా రూ.1000 కోట్లు ఏయూఎం వస్తే ఇప్పుడు రూ.5 వేల కోట్లు వస్తోంది. దానిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది విక్రయించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే నంబర్ 1 చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. గమనిక: ఈ కథనం సమాచారం ఇవ్వడానికి మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే ఫండ్ గతంలోని రిటర్న్స్ భవిష్యత్తులోనూ ఇస్తుందని చెప్పలేము. నిపుణుల సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది.