" షిరిడీ సాయి ఆలయాల విషయంలో నా వ్యాఖ్యలు వక్రీకరించారు": ఆనం రామనారాయణ రెడ్డి

Wait 5 sec.

కొంతమంది వక్రీకరించారని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినన్న మంత్రి .. ప్రతిరోజూ ఉదయం తన పూజా మందిరంలో షిర్డీ సాయిబాబా స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే తన దినచర్యను ప్రారంభిస్తానని తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని.. ఒకవేళ ఏ ఒక్క భక్తుడి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మన్నించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ, టీటీడీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదని,.. ఎవరి విశ్వాసాలనూ కించపరచదని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపడుతున్న 5000 భజన మందిరాల నిర్మాణ కార్యక్రమానికి ఓ లక్ష్యముందని.. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే దీని ఉద్దేశమని మంత్రి వివరించారు. నిధుల విడుదల అనేది పూర్తిగా శ్రీవాణి ట్రస్టు నిబంధనలు, మార్గదర్శకాలు, పరిపాలనా విధానాల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులను సాయిబాబా ఆలయాలకు ఇవ్వకపోవడం అనేది షిరిడీ సాయిబాబాను, స్వామి భక్తులను అవమానించడం కాదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం కేవలం శ్రీవాణి ట్రస్టు నిబంధనలకు సంబంధించిన అంశం మాత్రమే తప్ప, భక్తికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. మన సమాజంలో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారితో పాటు సాయిబాబా పట్ల ప్రజలకున్న అపారమైన విశ్వాసాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని. సనాతన ధర్మ పరిరక్షణ, ప్రతి భక్తుని విశ్వాసాన్ని గౌరవించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రయత్నాలను నమ్మవద్దని షిరిడీ సాయి భక్తులను మంత్రి కోరారు.