మహిళలకు భారీ శుభవార్త.. ఒక్కరోజే రూ. 3 వేలకుపైగా తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ ఇప్పుడెంతంటే?

Wait 5 sec.

Gold Price Fall: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. ఇక్కడ అమెరికా ఇరాన్ డీల్ జరగ్గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మరోవైపు బంగారం ధర తగ్గుతుండటం గమనార్హం. ఇన్ని రోజులు ముడి చమురు ధర పెరిగితే బంగారం ధర తగ్గడం, అదే చమురు ధర తగ్గితే బంగారం ధర పెరగడం జరిగాయి. కానీ ఇప్పుడు యుద్ధం ముగియడంతో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగిన క్రమంలో పెట్టుబడిదారులు అటు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్కడ పసిడి ఆకర్షణ కోల్పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ధరలు పతనం అవుతున్నాయి. తగ్గేందుకు ఇతర ప్రధాన కారణాల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు కూడా ఉన్నాయి. అవును ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచినప్పటికీ.. ఈ ఏడాదిలో మున్ముందు వడ్డీ రేట్లు పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్ల టార్గెట్ 2 శాతంలోపు ఉండాలంటే వడ్డీ రేట్లు పెంచాల్సి ఉందన్న అవశ్యకతను నొక్కి చెప్పింది. దీంతో ఇది కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణంగా నిలుస్తుంది.అంటే పెంచితే మళ్లీ డాలర్, బాండ్లకు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయడం భారంగా మారుతుంది. దీంతో ఇది ఆకర్షణ కోల్పోయినట్లు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ విలువ 101 మార్కు దాటగా ఇది గతేడాది ఏప్రిల్ నాటి గరిష్ఠాల్ని తాకింది. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర పెరుగుతుంది. అదే వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర తగ్గుతుంది.రూ. 3 వేలకుపైగా డౌన్ఈ క్రమంలోనే పసిడి ధర జూన్ 23- 24 మధ్య భారీ స్థాయిలో తగ్గింది. ప్రస్తుతం జూన్ 24న వార్త రాసే సమయంలో ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3100 తగ్గడంతో తులం రూ. 1,32,550 కి చేరింది. దీనికి ముందు వరుసగా రూ. 1750, రూ. 200 మేర పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 3380 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 1,44,600 వద్ద ఉంది. బంగారం ధరల బాటలోనే వెండి ధర కూడా రూ. 5000 తగ్గడంతో కేజీకి ప్రస్తుతం రూ. 2.50 లక్షల వద్ద ఉంది.ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు చూస్తే ఔన్సుకు 4100 డాలర్ల మార్కు దిగొచ్చింది. కిందటి రోజు ఇది 4150 డాలర్ల మార్కుపైన ఉండేది. సిల్వర్ రేటు 62 డాలర్ల దిగువకు పడిపోయింది.గమనిక: ఇది జూన్ 24న ఉదయం 7 గంటల సమయంలోని ధరలుగా గమనించాలి. ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ రోజువారీగా ధరలు మారే అవకాశం ఉంటుంది. గమనించగలరు.