NDA నుంచి బయటకురావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారా?.. ఓహో అసలు సంగతి అదన్నమాట

Wait 5 sec.

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారా?. ఈ అంశంపై చర్చించేందుకు ఓ బడా పారిశ్రామికవేత్త, మాజీ ఉప రాష్ట్రపతితో సమావేశమయ్యారా?. ఈ అంశంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోందా.. అసలు ఇదంతా నిజమేనా?. ఈ ప్రశ్నలన్నిటికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ కాంక్లేవ్‌లో ఈ అంశంపై స్పందించారు. రావాలని భావించినట్లు జరుగుతున్న ప్రచారం వదంతి మాత్రమే అన్నారు. ఈ అంశం గురించి చర్చ జరుగుతున్న సమయంలో తాను చంద్రబాబు భేటీ అయ్యారని చెబుతున్నవారిలో ఒకరిని కలిశానన్నారు. అలాగే ప్రధాని మోదీని కలిసిన సమయంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందో వివరించానన్నారు.ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి ఎవరో ఒకరు.. టీడీపీ అసంతృప్తితో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లానుకుంటోందని ప్రచారం చేస్తున్నారన్నారు లోకేష్. టీడీపీ ఎన్డీఏలోనే ఉందని, ఇకపై కూడా ఉంటుందన్నారు.. కానీ పదేపదే నిరూపించుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎవరిని కలిశానో, ఏం మాట్లాడానో ప్రధాని మోదీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. తాను చెప్పిన అంశాలను విని ప్రధాని కూడా నవ్వారని.. తన దృష్టికి ఇలాంటి అంశాలు రాలేదని మోదీ తనతో చెప్పారన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే తనకు తెలిసేదని.. తానే నేరుగా అడిగేవాడినన్నారు. ఒకవేళ ఇలాంటి వదంతులు వస్తాయని ముఖ్యమైన వారిని కలవడం మానేయొద్దని కూడా ప్రధాని సూచించారన్నారు లోకేష్. ప్రధాని మోదీ, కేంద్రంలో ఎన్డీఏకు టీడీపీ మద్దతు కొనసాగుతందన్నారు. ప్రధానిని కలిసేందుక ఎప్పుడు సమయం కోరినా ఇస్తున్నారన్నారు.దేశానికి ఒక స్థిరమైన నాయకత్వం అవసరం ఉందన్నారు మంత్రి లోకేష్. 2024లో టీడీపీ ఎన్డీఏలో చేరిన సమయంలో ఎలాంటి షరతులు కూడా పెట్టలేదని.. తాము ఇప్పటికీ కూడా అదే మాటపై ఉన్నామని.. కట్టుబడి ఉంటామన్నారు. ఒకవేళ తమ మధ్య ఏవైనా విధానాలకు సంబంధించి అభిప్రాయభేదాలువస్తే కూర్చుని చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడేది లేదన్నారు మంత్రి నారా లోకేష్.