6 బంతుల్లో 6 పరుగులు కావాలి.. హ్యాట్రిక్ వికెట్ తీసిన అకేలా.. ఆఖరి బంతికి హార్ట్ బ్రేక్

Wait 5 sec.

టీ20 మజా అంటే ఇప్పటి వరకు ఐపీఎల్ అనే అనుకున్నాం. కానీ అంతకు మించిన కిక్కిచ్చింది మేజర్ లీగ్ 2026. యూఎస్ఏ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అయితే, అప్పటి వరకు సాదాసీదాగా సాగుతున్న లీగ్ మ్యాచ్‌లలో వాషింగ్టన్ ఫ్రీడమ్ - టెక్సాస్ సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులను ఒక్కసారిగా మేజర్ లీగ్ వైపు చూసేలా చేసింది. వాషింగ్టన్ వర్సెస్ టెక్సాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ మినీ హార్ట్ అటాక్ తెప్పించింది. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులే కావాల్సి ఉండటం.. వాషింగ్టన్ చేతుల్లో నాలుగు వికెట్లు ఉండటంతో మ్యాచ్ వన్‌సైడ్ అనుకున్నారు. క్రీజులో మార్కో యాన్సన్ 3 బంతుల్లో 9, 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. మొదటి ఐదు బంతుల్లో టెక్సాస్ వైపు మొగ్గిన విజయం.. ఆఖరి బంతికి వాషింగ్టన్ సొంతం అవడంతో క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 186 లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ జట్టుకు ఓపెనర్ మిచెల్ ఓవెన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. మిచెల్ ఓవెన్ 77, స్టీవ్ స్మిత్ 30 పరుగులు చేసి ఆల్‌మోస్ట్ జట్టును మ్యాచ్‌ను ముగించేశారు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత నుంచి వాషింగ్టన్ పతనం మొదలైంది. కానీ మిడిలార్డర్ బ్యాటర్ నిఖిల్ చౌదరి వికెట్లు పడుతున్నా స్కోర్ చేస్తూ వచ్చాడు. 19 ఓవర్లకు వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌కి ఆరు పరుగులు చేయాల్సి ఉండటంతో ఈజీగా వాషింగ్టన్‌దే విజయం అని అందరూ అనుకున్నారు. అకేలా హోసెన్ 20 ఓవర్ బౌలింగ్ చేయడానికి రాగా 3 బంతుల్లో 9 పరుగులు చేసిన మార్కో యాన్సన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్నాడు. తొలి బంతి డాట్ కాగా, రెండో బంతికి క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. మూడో బంతికి ఎమీలా షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. నాలుగో బంతికి ఆసీఫ్ మహమూద్ కూడా క్యాచ్ రూపంలో అవుటవ్వడంతో.. కీలకమైన చివరి ఓవర్‌లో అకేలా హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని మ్యాచ్‌ని టెక్సాస్ వైపు తిప్పాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన లాకీ ఫెర్గ్యూసన్ లెగ్ బైస్ రూపంలో సింగిల్ తీశాడు. ఆఖరి బంతికి వాషింగ్టన్ జట్టు గెలవాలంటే ఐదు పరుగులు చేయాల్సి ఉండగా నిఖిల్ చౌదరి సిక్సర్ బాది విజయాన్ని అందించాడు. అప్పటి వరకు టెక్సాస్ చేతుల్లో ఉన్న విజయం ఒక్కసారిగా వాషింగ్టన్ వైపు వెళ్లడంతో హ్యాట్రిక్ వికెట్లు తీసిన అకేలా హోసెన్ హార్ట్ బ్రేక్ అయింది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన నిఖిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.