రూ.5 లక్షల FDపై ఏకంగా 12 శాతం వడ్డీ.. ఆపైన రూ.10 వేలు అదనం.. ఆ బ్యాంక్ ఎందుకు ఎక్కువ చెల్లిస్తోందంటే?

Wait 5 sec.

Bank FD: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే సురక్షితమని భావిస్తారు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్‌తో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటివి చేస్తుంటారు. సురక్షితమైన రాబడి కోరుకునే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. సాధారణంగా బ్యాంకులు గరిష్ఠంగా చూసుకుంటే 8 శాతం వరకు వడ్డీ ఇస్తుంటాయి. కానీ, ఆపైన రూ.10 వేలు అదనంగా ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ డిపాజిట్ల విషయంలో కేరళ హైకోర్టు ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బులను నిర్వహించే బ్యాంకులు వారికి తిరిగి చెల్లించ్ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇంతకీ ఏం జరిగింది?కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఓ డిపాజిటర్ తాను రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశానని, అది 2015లోనే మెచ్యూరిటీ పూర్తి చేసుకోగా సాంకేతిక కారణాలు చూపిస్తూ బ్యాంకు తనకు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేశాడు. వినియోగదారుల ఫోరంలోనూ సరైన న్యాయం జరగకపోవండతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ కేసును పూర్తిగా విచారించిన కేరళ హైకోర్టు జూన్ 2, 2026న కీలక తీర్పు వెలువరించింది. ఖాతాదారుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ క్రమంలోనే రూ.5 లక్షల డిపాజిట్ తిరిగి చెల్లించడంలో ఆలస్యమైనందుకు గానూ 12 శాతం వడ్డీ చొప్పున చెల్లించాలని ఆపైన పరిహారంగా రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఈ క్రమంలో తమకు 6 నెలల సమయం ఇవ్వాలని బ్యాంకు కోరడంతో అందుకు అనుమతి ఇచ్చింది. ఎవరికి జరిగిందంటే?త్రిస్సూర్ ప్రాంతంలోని ముళ్లంకున్నాత్ కేవుకు చెందిన సేతుమాధవన్ అనే వ్యక్తి బ్యాంకులో రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అది 2015, జూన్2న మెచ్యూరిటీ కాలం పూర్తి చేసుకుంది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తి బ్యాంకును ఆశ్రయించారు. కానీ, టెక్నికల్ కారణాలు చెబుతూ బ్యాంక్ తిరిగి చెల్లించలేదు. దీంతో త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో 2021, డిసెంబర్ 31వ తేదీన కన్సూమర్ డిస్పూట్ రిడ్రెసల్ కమిషన్ తీర్పు వెలువరించింది. రూ.5 లక్షల డిపాజిట్‌కు 12 శాతం చొప్పున వడ్డీ ఇస్తూనే రూ.10 లక్షల పరిహారం ఇవాలని బ్యాంకును ఆదేశించింది. దీంతో కేరళ హైకోర్టులో బ్యాంక్ అప్పీల్ దాఖలు చేసింది. 825 రోజులు జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ జాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని బ్యాంక్ కోరింది. అప్పీల్ దాఖలు చేయడంలో జరిగిన తీవ్ర జాప్యానికి కారణం, డిసెంబర్ 10, 2014 నుండి మే 7, 2022 వరకు తమ యాజమాన్యం ఒక అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి) పర్యవేక్షణలో ఉండటమేనని బ్యాంక్ పేర్కొంది. కానీ కేరళ హైకోర్ట్ సింగిల్ బెంచ్ ధర్మాసనం బ్యాంక్ అప్పీల్‌ను తిరస్కరించింది. కన్సూమర్ కమిషన్ తీర్పు ప్రకారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వచ్చినా బ్యాంక్ డబ్బులు తిరిగి చెల్లించలేదు. కేరళ హైకోర్టు ఉన్నత ధర్మాసనానికి అప్పీల్ చేసుకుంది. ఈసారి, బ్యాంక్ తన న్యాయపరమైన వాదనను మార్చుకుంది. తాము ఒక సహకార బ్యాంక్ కాబట్టి, 'కేరళ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 1969'లోని సెక్షన్ 69 వర్తిస్తుందని, తద్వారా కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తికి ఈ విషయంలో విచారణ జరిపే అధికార పరిధి (jurisdiction) లేదని వాదించింది.జూన్ 2, 2026న, కేరళ హైకోర్టుకు చెందిన ఒక విస్తృత ధర్మాసనం (larger bench) బ్యాంకు వాదనలను తోసిపుచ్చి, వినియోగదారుల కమిషన్ ఉత్తర్వును సమర్థించింది. దీని ఫలితంగా, బ్యాంకు ఇప్పుడు రూ. 5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని 12 శాంత వడ్డీతో పాటు రూ.10,000 పరిహారంతో సహా ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.