సెక్షన్ 87A కింద ఎంత పన్ను 'రిబేట్' వస్తుంది? ఎవరు అర్హులు.. కొత్త Vs పాత పన్ను లెక్కలు ఇవే!

Wait 5 sec.

Income-tax returns: దేశంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ప్రభుత్వానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంత పరిమితి వరకు పన్ను రాయితీ (రిబేట్) కల్పిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అని రెండు పద్ధతుల ద్వారా ట్యాక్స్ లెక్కిస్తున్నారు. గతేడాది వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులు ప్రతిపాదించారు. అవి ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేకపోయినప్పిటికీ కొత్త పన్ను విధానంలో రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ భారీగా పెంచారు. అనే ప్రశ్న మొదలైంది. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానాల్లో ఎంత ఆదాయం ఉంటే ఎంత రిబేట్ వస్తుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉశమనం సెక్షన్ 87A ట్యాక్స్ రిబేట్. నికర ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలోపు ఉంటే ఈ సెక్షన్ కింద మీ పన్ను పూర్తిగా జీరోగా చేసుకోవచ్చు. ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ 2026-27తాజా నిబంధనల ప్రకారం సెక్షన్ 87ఏ కింద లభించే రాయితీ, అర్హతలు, రూల్స్ వివరాలు తెలుసుకుందాం. అయితే ట్యాక్స్ పేయర్ ఎంచుకునే పన్ను విధానాన్ని బట్టి రిబేట్ మారుతుంది. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12 లక్షలు లేదా అంత కంటే తక్కువగా ఉన్నప్పుడు గరిష్ఠంగా రూ.60,000 వరకు ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. ఇక పాత పన్ను విధానం ఎంచుకుంటే మీ నికర ఆదాయం రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువగా ఉన్నప్పుడు గరిష్ఠంగా రూ.12,500 వరకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది. అయితే ఈ రిబేట్ కేవలం దేశంలో నివసించే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రవాస భారతీయులకు ఈ రిబేట్ వర్తించదు. అలాగే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. హిందూ అవిభాజ్య కుటుంబాలు, కంపెనీలు లేదా భాగస్వామయ్ సంస్థలకు ఈ రాయితీ రాదు.కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలు దాటకూడదు. ఒక వేళ ఒక్క రూపాయి దాటినా ఈ రిబేట్ వర్తించదు అంటే కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలు స్వల్పంగా దాటిన వారికి మార్జినల్ రిలీఫ్ ఇస్తారు. అలాగే సెక్షన్ 112ఏ కింద వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలు, షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాభాలకు ఈ రిబేట్ వర్తించదు. లాటరీలు, బెట్టింగ్స్ లేదా గేమ్ షోల ద్వారా వచ్చే ప్రత్యేక పన్ను రేట్ల ఆదాయాలకు వర్తించదు.