: స్మాల్ క్యాప్ కేటగిరిలోని జ్యూవెలరీ సెక్టార్ కంపెనీ డివైన్ హీరా జ్యూవెలర్స్ లిమిటెడ్ () సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రకారం కంపెనీకి చెందిన 1 షేర్ కొనుగోలు చేస్తే ఉచితంగా 2 ఈక్విటీ షేర్స్ బోనస్‌గా ఇస్తారు. ఈ బోనస్ ఇష్యూ సైతం కంపెనీ చరిత్రలోనే మొట్టమొదటిది కావడం విశేషం. మరోవైపు ఈ షేర్ గత ఏడాదిలోనే ఏకంగా 525 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డివైన్ హీరా జ్యూవెలర్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్ధం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేర్ కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ ఇష్యూకి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని జులై 02, 2026గా కంపెనీ నిర్ణయించింది.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో డివైన్ హీరా జ్యూవెలర్స్ లిమిటెడ్ షేరు 0.16 శాతం నష్టంతో రూ. 319 వద్ద ముగిసింది. అలాగే ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 346.50 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 50.10 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 2 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 2 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో 37 శాతం నష్టపోయింది. గత ఏడాది కాలంలో 525 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఏడాదిలోనే ఆ విలువ రూ.6.25 లక్షలు అవుతుంది. గత 15 నెలల కాలంలో 254 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 416 కోట్ల వద్ద ఉంది.గమనిక: ఈ కథనం కేవలం సమాచారం అందించడానికే. ఎలాంటి పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్ అంటే హైరిస్క్ ఉంటుంది. ఎంచుకున్న స్టాక్ గురించి ముందుగానే అన్ని తెలుసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.