రైల్వే సంస్థలో కేంద్రం వాటా విక్రయం- తొలిరోజే ఎగబడ్డ ఇన్వెస్టర్లు.. అమ్మకానికి మరో 13 కోట్ల షేర్లు!

Wait 5 sec.

: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వహిస్తున్న ఆఫర్ ఫర్ సేల్‌కు (OFS) మంచి రెస్పాన్స్ లభిస్తున్న సంగతి తెలిసిందే. వరుస పెట్టి ప్రభుత్వ దిగ్గజ సంస్థలు, బ్యాంకుల్లో వాటా విక్రయిస్తుండగా ఇప్పుడు . ముందుగా నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తీసుకురాగా వీరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారని చెప్పొచ్చు. మొత్తం 2 శాతం వాటా విక్రయానికి అంగీకారం తెలపగా.. ముందుగా ఒక శాతం విక్రయించి, తర్వాత రెస్పాన్స్‌ను బట్టి మరో శాతం విక్రయిస్తామని ప్రకటించింది. దీనిని గ్రీన్ షూ లేదా ఓవర్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కింద కేటాయించింది ఇందులో భాగంగా ఒక శాతానికి సమానమైన 13.06 కోట్ల షేర్లను తొలుత విక్రయించాలని ప్లాన్ చేసింది. ఇందులో నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు 11.76 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా తొలిరోజే ఇక్కడ ఏకంగా 21.87 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేశారు. దీంతో 1.86 రెట్ల మేర సబ్‌స్క్రైబ్ అయింది. ముందటి క్లోజింగ్ ధర రూ. 98 తో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంట్ ధరకే రూ. 91.07 వద్దే విక్రయం జరిగింది.ఇక ఇవ్వాళ జూన్ 25న రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం అందుబాటులో ఉంటుందని ప్రకటించగా దీనికి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే తొలి రోజు మంచి రెస్పాన్స్ లభించగా ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్ వినియోగిస్తోంది. అంటే ఇక్కడ గురువారం రోజు మరో 13.06 కోట్ల షేర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఓఎఫ్ఎస్ ద్వారా మొత్తం 26.13 కోట్ల షేర్ల విక్రయంతో సుమారు రూ. 2300 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేసింది. అయితే తొలిరోజే సంస్థాగత మదుపరుల నుంచి రూ. 1900 కోట్ల వరకు విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. అయితే ఓఎఫ్ఎస్ లాంఛ్ అవగా ఐఆర్ఎఫ్‌సీ షేర్లు బుధవారం సెషన్‌లో భారీగా పతనం అయ్యాయి. 5 శాతానికిపైగా పతనంతో రూ. 92.50 వద్ద స్థిరపడింది. గురువారం సెషన్‌లో కూడా షేరు స్వల్పంగా నష్టాల్లో ఉంది.