రైతులకు బిగ్ రిలీఫ్.. మంత్రి కీలక ప్రకటన.. ఇక నో వర్రీస్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఊరట కలిగించే వార్త వినిపించారు. రాష్ట్రంలో అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎరువుల లభ్యత, సరఫరాపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్ అసోషియేషన్ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు అవసరమైన మేరకే కాకుండా, అవసరానికి మించి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఎరువుల కొరత లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.డీలర్లకు వార్నింగ్ ఇచ్చిన మంత్రిమరోవైపు రాష్ట్రంలోని ఎరువుల డీలర్లకు మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. రైతులు యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే సమయంలో.. వారికి బలవంతంగా ఇతర కాంప్లెక్స్ ఎరువులను అంటగట్టవద్దని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలను డీలర్లు, కంపెనీలు నిలిపివేయాలని.. రైతులకు అవసరమైన, వారికి నచ్చిన ఎరువులను మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. అలా కాకుండా రైతులకు అనవసరమైన ఎరువులు, ఉత్పత్తులను బలవంతంగా అమ్మే.. డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి కంపెనీలపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరలకే ఎరువులు అమ్మాలని.. అధిక ధరలకు విక్రయించాలని చూస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎరువులు పక్కదారి పట్టకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రతి ఎరువుల బస్తాకు కూడా లెక్క ఉండేలా పర్యవేక్షిస్తున్నామని.. గత ప్రభుత్వాలలో జరిగినట్లుగా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.ఎరువుల బుకింగ్ యాప్ సులభతరం చేయండి.. మరోవైపు ఎరువుల బుకింగ్ యాప్‌ల నిర్వహణను మరింత సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఓటీపీల ఆలస్యం వంటి టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే భూసార పరిరక్షణ, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు రైతులు నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. రసాయన ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.