తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు, ఆరెంజ్ అలర్ట్

Wait 5 sec.

తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వర్షాలు కురవడం లేదు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వేడి, ఎండలు, ఉక్కపోత భరించలేకపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో.. అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంటకు 41 కిలోమీటర్ల నుంచి 61 కిలోమీటర్ల వేగంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉరుములతో పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.అదే సమయంలో 3 రోజుల్లో కూడా ఆయా జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బుధవారం రోజున ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తేల్చి చెప్పింది. గురువారం రోజున నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.