హా.. బిగ్ బాస్ సీజన్ 10‌కి ఖతర్నాక్ లాంటి కంటెస్టెంట్ దొరికేసింది. ఎవరెవరో స్క్రాప్ బ్యాచ్‌ని తీసుకొచ్చి వీళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని జనాలపై రుద్దుతున్న బిగ్ బాస్‌‌కి మెరుపుతీగ పిల్ల ఎదురొచ్చి నన్ను తీసుకోండి మహా ప్రభో అంటే వద్దంటారా? హారతిపట్టేయరూ. ఇదిగో మదనపల్లెకి చెందిన ఈ 21 ఏళ్ల లేత పిల్ల బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఢీ కొట్టి అటు నుంచి అటే బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడానికి పావులు కదుపుతోంది. మరో 75 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కానుండగా.. ఆ హౌస్‌లోకి పంపడానికి గతంలో మాదిరే షురూ అయ్యింది. దీనికి సంబంధించి ఆడిషన్స్ ప్రక్రియను వేగవంతం చేశారు. నిజానికి ఈనెల అంటే జూన్ 20 నాటికే.. అప్టై చేసుకోవడానికి గడువు ముగిసింది. కానీ.. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారిగా గడువు అయిన తరువాత కూడా మరో అవకాశాన్ని కల్పిస్తూ.. బిగ్ బాస్ సీజన్ 10 టైటిల్ స్పాన్సర్ ‘వైట్ గోల్డ్’ మరో కాంటస్ట్‌ని పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా కామనర్స్‌గా బిగ్ బాస్ అగ్నిపరీక్షలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారో.. వాళ్లు తమ ప్రొఫైల్‌కి సంబంధంచిన వీడియోనే పంపించాల్సి ఉంటుంది. ‘వైట్ గోల్డ్’ కాంటస్ట్‌ ద్వారా ఒక కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌కి పంపిస్తారన్నమాట. దీని గడువు కూడా జూన్ 28 నాటితో ముగియనుంది. అయితే ‘వైల్డ్ గోల్డ్’ అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుకునే వాళ్లు వీడియో చేసి.. వైట్ గోల్డ్‌ని ట్యాగ్ చేస్తూ.. పబ్లిక్‌లో ఆ విడియోను షేర్ చేసుకుంటున్నారు. అలా ఈ మదనపల్లి పిల్ల వెలుగులోకి వచ్చింది. ఈమె పేరు ఎం వశిష్ట. వయసు 21 ఏళ్లు. మన తెలుగు అమ్మాయే కానీ.. బెంగుళూరులో చదువుకుంటూ మోడలింగ్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకి 49.7k ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు యాభై వేల మందన్నమాట. అయితే ఆమెకి బిగ్ బాస్‌లోకి వెళ్లాలనే బలమైన కోరిక ఉండటంతో పాటు.. తన నేపథ్యం గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది తాజా వీడియోలో. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈమె మిస్ బ్యూటిపుల్ హెయిర్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. మరి ఏం తిని పెంచుతుందో ఏమో కానీ.. ఆమెకి జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా ఉంది. తన బలమైన జుట్టునే ఆదాయ వనరుగా మార్చుకుని.. సొంతంగా హెయిర్ కేర్ బ్రాండ్‌ని స్టార్ట్ చేసింది. ఇక మోడలింగ్‌లోనూ రాణిస్తుండటంతో.. ఆమె ఫొటోలు కూడా ఫుల్ గ్లామరస్‌గా ఉన్నాయి. బిగ్ బాస్ అగ్నిపరీక్షకే కాదు.. నేరుగా బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్‌కే ఫుల్ వర్తూ అనిపిస్తున్న ఈ పిల్ల తన గురించి తాను.. చెప్పుకుంటూ తాను ఎందుకు బిగ్ బాస్‌కి వెళ్లాలని అనుకుంటుందో చెప్పుకొచ్చింది. ‘‘నా పేరు విశిష్ట. (ishta_vis) నా 21 ఏళ్లు. నేను మదనపల్లి నుంచి వచ్చిన తెలుగు అమ్మాయిని. నేను బెంగుళూరులో ఉంటూ ఎంబీఏ చదువుతూ మోడలింగ్‌తో పాటు.. సొంతంగా హెయిర్ కేర్ బ్రాండ్‌ని కూడా బిల్డ్ చేస్తున్నా. నా జర్నీ గురించి చెప్పాలంటే.. నాకు మోడలింగ్‌పై అసలు ఐడియానే ఉండేది కాదు. ఒక బ్యూటీపార్లర్‌ వెళ్లడంతో మిస్ బ్యూటిపుల్ హెయిర్ ఇండియా టైటిల్ విన్ కావడంతో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. లైఫ్ నాకు చిన్నప్పుడే కొన్ని ఛాలెంజ్‌లను ఇచ్చింది. మా అమ్మ ఒక్కతే నన్నూ మా అన్నయ్యని పెంచి పెద్ద చేశారు. మా అమ్మ తన లైఫ్‌ని హ్యాండిల్ చేసిన విధానం చూసిన నాకు.. సమస్యని సమస్యలా కాకుండా ఛాలెంజ్‌లా చూడటం నేర్చుకున్నా. నాకు బిగ్ బాస్ అంటే కేవలం ఎంటర్‌టైన్మెంట్ కాదు. అది ఒక పర్సనాలిటీ టెస్ట్. ఒత్తిడిలోనే మన ఒరిజినల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. మనం ఎంత జెన్యూన్‌గా ఉన్నాం.. ఎమోషనల్‌గా ఉన్నాం.. పోటీ పడుతున్నాం అని అక్కడే తెలుస్తుంది. నేను చాలా ఎమోషనల్. స్నేహానికి వాల్యూ ఇస్తా. కానీ నా మోరల్స్ కోసం నిలబడాల్సి వస్తే.. నా స్టాండ్ నేను తీసుకుంటా. నా లైఫ్‌లో కొన్ని సిచ్యువేషన్స్ నన్ను ఏడిపించాయి.. కొన్ని నవ్వించాయి.. కొన్నైతే ఏకంగా నన్నే మార్చేశాయి. కానీ ప్రతి ఎక్స్ పీరియన్స్ నాకు ఏదొకటి నేర్పించింది. నేను ఏం నమ్ముతానంటే.. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా దాని నుంచి మనం ఎలా బయటకు వస్తాం అన్నదే మన క్యారెక్టర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా.. నేను వెనక్కి తగ్గను. కాబట్టి నాకు బిగ్ బాస్‌లో ఒక ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ వీడియోను షేర్ చేసింది విశిష్ట. బిగ్ బాస్ ఆటలో రాణించడానికి చాలా క్వాలిటీస్ ఈమెలో కనిపిస్తున్నాయి. టాలెంట్‌తో పాటు.. గ్లామర్‌గా కూడా ఉంది. పైగా బిగ్ బాస్ ఆటపై అభిరుచి ఉండటమే కాదు.. గెలవాలనే కసి కూడా కనిపిస్తుంది. ఇన్ని టాలెంట్లు ఉంటే బిగ్ బాస్ ఎందుకు వదిలిపెడతాడూ.. ఈమె అగ్నిపరీక్షకే కాదు.. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్‌గా కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.