స్వదేశంలో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లాండ్‌కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఆ జట్టు కెప్టెన్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచులో.. న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల తేడాతో మూడో టెస్టులో గెలిచి.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కొన్ని నెలల క్రితం భారత్‌ను భారత్‌లో 3-0తో టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. తాజాగా ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ విక్టరీ నమోదు చేసింది.3 టెస్టులో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో మూడు మ్యాచులో సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే నాటింగ్‌హమ్ టెస్టులో పర్యాటక కివీస్ సత్తాచాటింది. తొలి ఇన్నింగ్స్‌‌లో 438 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 354 పరుగులకు ఆలౌట్ చేసి, కీలక ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 288/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు.. 373 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్.. 212 పరుగులకే కుప్పకూలింది. దీంతో 160 పరుగుల తేడాతో ఓడి.. ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది.కాగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. అంతర్జాతీయ కెరీర్ ఓటమితో ముగిసింది. మూడో మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు అతడు.. ఈ మేరకు నాలుగో రూటు ఆట ప్రారంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో తన నిర్ణయాన్ని చెప్పి.. సహచరులను ఆశ్చర్యపరిచాడు. 35 ఏళ్ల బెన్ స్టోక్స్ తన కెరీర్‌లో 122 టెస్టులు ఆడాడు. 114 వన్డేలు, 43 టీ20 మ్యాచులు సైతం ఆడాడు.కాగా కెరీర్‌లో ఇంగ్లాండ్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన బెన్ స్టోక్స్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఈ మేరకు అతడి కెరీర్‌లో ముఖ్యమైన సంఘటనలతో కూడిన వీడియోను షేర్ చేసింది.