AP Rain Alert: ఈ జిల్లాలలో రేపు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు.. రుతుపవనాల కారణంగాఉరుములు మెరుపులతో వానలు పడతాయని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మంగళవారం వర్షం కురిసే జిల్లాలు..మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రోజున ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది,మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. కల్వర్టులు, కాలువల సమీపానికి వెళ్లవద్దని అప్రమత్తం చేశారు. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణుల ప్రభావంతో మంగళవారం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఆదివారం రోజున తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా రావినూతలలో అత్యధికంగా 7.8 సెం.మీ. వర్షం కురిసింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.