ఏపీలో ఆ పథకం ఆగిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్.. ఆగలేదు కానీ..?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి స్పందించారు. విద్యార్థి మిత్ర కిట్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం, షూ, బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. "ఇది పూర్తిగా అవాస్తవం, వందశాతం అబద్ధం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప‌శ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాం క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెల రోజులు ఆలస్యమవుతుందని విద్యా శాఖ తెలిపింది" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. నాటికి ఖచ్చితంగా అందుతాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థి మిత్ర కిట్‌లో మిగిలిన దుస్తులు-వ‌స్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి త‌యారీ సంస్థల‌తో అధికారులు నిత్యమూ సంప్రదింపులు జ‌రుపుతున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు. వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్ జగన్ తన టీమ్‍‌తో విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా త‌ప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కిట్లు పంపిణీ కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని నిజాయితీగా అధికారులు ప్రకటిస్తే, దానిని వ‌క్రీక‌రించి, అస‌లు కిట్ల పంపిణీ ఉండ‌దంటూ విష ప్రచారం చేయటం జగన్ వక్ర బుద్ధికి నిదర్శమనంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ స్పందనమరోవైపు ఈ విషయంపై సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా స్పందించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ కిట్ల సరఫరా ఆలస్యం అవుతుందని వెల్లడించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరకుల ధరల పెరుగుదల వంటి కారణాల వలన విద్యార్థులకు కిట్ల సరఫరా నెల రోజులు ఆలస్యమయ్యేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధర భారీగా పెరిగిందని, ఇదే సమయంలో రవాణాలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. వీటి ప్రభావం విద్యార్థి మిత్ర కిట్లలోని వస్తువుల తయారీపై పడిందన్న ఆయన.. సరఫరాదారులు కొంత గడువు కోరినట్లు తెలిపారు. జూన్‌ 12న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందేలా చర్యలు చేపట్టామని.. పేరెంట్స్ టీచర్స్ సమావేశం నాటికి మిగతా వస్తువుల పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. వేగంగా సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.