మరో మూడు రోజులు ఇంతే.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. దంచికొడుతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత ఆదివారం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీలు, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, పోలవరం జిల్లాలోని కూనవరంలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఆదివారం రోజున 17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో.. ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య వీలైనంత వరకు బయటకు రావద్దని సూచించింది. మరోవైపు మే 25 (సోమవారం) : కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాలలో 45°C - 47°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం,మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాలలో 43°C - 45°C ఉష్ణోగ్రతలు.. రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ,అనకాపల్లి జిల్లాలలో 40°C - 43°C వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు ద్రోణి ప్రభావంతో సోమవారం రోజున మార్కాపురం, ప్రకాశం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం,అల్లూరి, పోలవరం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అప్రమత్తం చేసింది. మరోవైపు ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60కి.మీ వేగంతో గాలులు వీచాయి.