ప్రొఫెసర్ నాగేశ్వర్‌ అన్ని పార్టీలనూ విమర్శిస్తారు: వైఎస్ జగన్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపాయి. దీనిపై జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు భగ్గుమన్నారు. ఇకకోరటంతో ప్రకటించారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ.. జనసేన కార్యకర్తలు పలుచోట్ల ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మోహన్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతున్నారని జగన్ ఆరోపించారు. జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్‌పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారని.. ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశాపని మండిపడ్డారు. ప్రభుత్వం దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలు ఎల్లకాలం సహించరనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్న వైఎస్ జగన్.. ప్రజల కోసం నిలబడటం తమ బాధ్యతని వెల్లడించారు. ప్రభుత్వ అక్రమాలు, అణచివేతలు, కక్షసాధింపులపై తమ పోరాటం ఆగదని.. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుందని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. చంద్రబాబు నియంతలా మారి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని జగన్ ఆరోపించారు.. ఇక మామిళ్లపల్లెకు రైతుల పరామర్శకు వెళ్తున్న వైసీపీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్ వంటి నేతలు, కార్యకర్తలపై దాడిని హేయమైన చర్యగా జగన్ పేర్కొన్నారు,