మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 8 రోజుల్లో మూడోసారి పెంపు.. హైదరాబాద్‌లో లీటరుకు ఎంతంటే?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులపై గణనీయ ప్రభావం పడుతోంది. ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరుగుతుండగా.. ఇన్ని రోజులు ఓపిక పట్టిన . దాదాపు రెండున్నర నెలల పాటు దేశీయంగా ఇంధన ధరల్ని స్థిరంగానే ఉంచినా.. ఇప్పుడు గత 8 రోజుల వ్యవధిలో మూడో సారి పెంచడం గమనార్హం. మే 23న మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్‌పై సగటున లీటరుకు రూ. 0.87 పెరగ్గా.. డీజిల్ ధర రూ. 0.91 చొప్పున పెరిగింది. ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంది. మే 15న తొలిసారి పెంచగా.. తర్వాత మళ్లీ మే 19న రేట్లను సవరించాయి. ఇప్పుడు మే 23న మరోసారి పెరిగాయి. అంటే ప్రతి 4 రోజులకు ఓసారి ధరలు మారుతున్నాయి. మున్ముందు ఇంకా పెరగనున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు పెంచిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటరుపై ఇవాళ రూ. 0.97 మేర పెరగ్గా రూ. 112.81 కి చేరింది. మే 15కు ముందు లీటర్ పెట్రోల్ రూ. 107.46 గా ఉండగా.. ఒక్కసారిగా రూ. 3.43 పెరిగి రూ. 110.89 కి చేరింది. . ఇప్పుడు రూ. 112.81 కి చేరింది. ఈ క్రమంలో 8 రోజుల వ్యవధిలో లీటరుపై రూ. 5.35 మేర పెరిగినట్లయింది. డీజిల్ ధర హైదరాబాద్‌లో తాజాగా రూ. 0.99 మేర పెరిగి లీటరుకు రూ. 100.94 కు చేరింది. తొలిసారిగా హైదరాబాద్ నగరంలో రూ. 100 మార్కు దాటేసింది. మే 15 కు ముందు రూ. 95.70 గా ఉండగా.. ఆరోజు రూ. 3.26 పెరిగింది. మే 19న మరోసారి రూ. 0.99 పెరిగింది. ఇక్కడ కూడా 8 రోజుల్లో లీటరుపై రూ. 5 కుపైగానే పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ. 99.51, రూ. 92.49 గా ఉన్నాయి. ముంబైలో రూ. 108.49, రూ. 95.02 గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. స్థానిక పన్ను రేట్ల కారణంగా రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. ఇదే సమయంలో మరోసారి CNG ధరలు కూడా పెరిగాయి. కిలో సీఎన్‌జీపై రూ. 1 పెంచింది. 10 రోజుల్లో CNG ధర మూడోసారి పెరిగింది.