కృనాల్ పాండ్యా ఇసురేసుడికి షాక్ అయిన కావ్య మారన్.. 'అదేంది వెంకీ గారు అలా ఇసిరేశాడు' అన్న సన్‌రైజర్స్ ఓనర్

Wait 5 sec.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృనాల్ ఓవర్‌లో ఫోరో, సిక్సరో కొట్టాడంటే ఆ ఓవర్‌లో బౌన్సర్లు గ్యారెంటీ. ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ ఇసిరేసుడు బౌలర్‌గా పేరొందిన కృనాల్ పాండ్యా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ అదే బౌలింగ్ వేశాడు. అయితే, తొలిసారి పాండ్యా బౌలింగ్‌ని అలా చూసిన షాక్ అయింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచి బౌండరీల మోత మోగించిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ క్లాస్ పేస్ బౌలర్లను ఉతికారుశారు. అయితే, తన ఓవర్‌లో బౌండరీలు బాదగానే కృనాల్ పాండ్యా బౌన్సర్ల వర్షం కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో రెండో బంతికే కృనాల్ పాండ్యా హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి తొలి బంతికే సిక్సర్ బాదాడు. దాంతో రెండో బంతి బౌన్సర్ వేయగా వైడ్ వెళ్లింది. మళ్లీ మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆఖరి బంతి నితీష్ కుమార్ రెడ్డి షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఈ సారి ఎక్కువ బౌన్సర్ రావడంతో గాల్లోకి లేపడంతో రెండు పరుగులు వచ్చాయి. అయితే, ఆఖరి బంతిని కృనాల్ పాండ్యా ఎక్కువ స్పీడ్‌తో విసిరేసినట్టు బౌలింగ్ చేయడంతో కావ్య మారన్ షాక్ అయింది. పక్కనే ఉన్న విక్టరీ వెంకటేశ్‌తో అదేంటండి అతను అలా విసిరేస్తున్నాడు అంటూ కావ్య మారన్ అనడం.. ఆ తర్వాత ఏంటో ఇది అన్నట్టు ఎక్స్‌ప్రషన్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 56, ఇషాన్ కిషన్ 79, హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 255/4 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆర్సీబీ 200/4కే పరిమితమవ్వడంతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది.