ట్రంప్ ప్రకటనలతో మళ్లీ తగ్గిన బంగారం ధర.. వెండి రూ. 10 వేలు డౌన్.. ఏ జువెల్లరీలో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Wait 5 sec.

Gold Price Fall: చాలా రోజుల తర్వాత మళ్లీ వరుసగా దిగొస్తున్నాయి. ఇప్పుడు వరుసగా రెండో రోజు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్ది రోజులుగా తగ్గుతున్నా.. దేశీయంగా రూపాయి విలువ భారీ పతనంతో ఆ ప్రభావం కనిపించకపోగా.. ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం ఆ తగ్గుదల ప్రభావం కనిపిస్తోంది. ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు అందడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు దిగొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని.. అతిత్వరలోనే శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటంతో.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4500 డాలర్ల దిగువకు చేరింది. 2 రోజుల కిందట ఇది 4700 డాలర్ల స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు చూస్తే 75.50 డాలర్ల స్థాయిలో ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి పుంజుకుంటోంది. 2 రోజుల కిందట రూ. 96.96 వద్ద జీవన కాల కనిష్ఠాల్ని తాకగా.. ఇప్పుడు రూ. 95.63 స్థాయికి పుంజుకుంది. >> రూపాయి విలువ పుంజుకోవడం వల్లనే 2 రోజులుగా కనిపించని తగ్గుదల ప్రభావం.. మళ్లీ కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇక్కడ కూడా రేట్లు దిగొస్తున్నాయి. దేశీయంగా ఇవాళ రూ. 400 తగ్గగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,45,800 కు చేరింది. ముందటి రోజు కూడా రూ. 400 తగ్గింది. దానికి ముందు వరుసగా రూ. 450, రూ. 2200, రూ. 750 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 430 తగ్గి రూ. 1,59,060 వద్ద ఉంది. Latest Gold Jewellery Rates:ప్రముఖ జువెల్లరీలో చూస్తే లలితా జువెల్లరీలో గ్రాము గోల్డ్ రేటు మే 23న ఉదయం 10.30 గంటలకు రూ. 14,580 వద్ద ఉంది. ఇదే తనిష్క్‌లో గ్రాము ధర రూ. 14,665 వద్ద ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖజానా, జోయాలుక్కాస్, కల్యాణ్ జువెల్లర్స్‌లో గ్రాము బంగారం ధర రూ. 14,580 వద్దే కొనసాగుతోంది. రూ. 10 వేలు తగ్గిన సిల్వర్ రేటు..మరోవైపు వెండి ధర రూ. 10 వేల మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షలకు చేరింది. దీనికి ముందటి రోజుల్లో వరుసగా రూ. 5 వేల చొప్పున 2 రోజులు పెరిగింది. దానికి ముందు మే 20న రూ. 15 వేలు తగ్గింది.