కోహ్లి కౌంటర్‌కి హెడ్ రీ కౌంటర్.. పటిదార్ వికెట్ తీసి ఉప్పల్‌లో రీ సౌండ్ తెప్పించాడు!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా కోహ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఇవన్నీ ఒకెత్త అయితే.. సవాల్ విసిరినట్టుగానే బౌలింగ్ చేయడమే కాకుండా, డేంజరస్ పటిదార్‌ను పెవిలియన్‌కు పంపడం ఇక్కడ హైలెట్‌గా నిలిచింది.శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లు, ఫోర్లు కొడుతున్న సమయంలోనే ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లి మాటలతో విరుచుకుపడ్డాడు. ఆఫ్ స్పిన్నర్‌వే కదా.. నువ్వు కూడా వచ్చి బౌలింగ్ చెయ్ అంటూ కోహ్లి రెచ్చగొట్టాడు. అయితే, కోహ్లి మాటలకు ట్రావిస్ హెడ్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లి షాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మ్యాచ్ పూర్తిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చింది అనుకున్న సమయంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ట్రావిస్ హెడ్ చేతికి బంతిని ఇచ్చాడు. 19వ ఓవర్‌లో హెడ్ బౌలింగ్‌కి రాగా.. తొలి బంతి కృనాల్ పాండ్యా ప్యాడ్స్‌కి తగిలి లెగ్ బైస్ రూపంలో ఒక పరుగు లభించింది. రెండో బంతికి కెప్టెన్ పటిదార్ స్ట్రయికింగ్ రావడం.. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో.. ఆ ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. ట్రావిస్ హెడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సిక్సర్ బాదే ప్రయత్నం చేసిన పటిదార్ బౌండరీ దగ్గర దొరికిపోయాడు. ఆ ఓవర్‌లో ఒక ఫోర్‌తో కలిపి ట్రావిస్ హెడ్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీసుకుని ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన ట్రావిస్ హెడ్.. విరాట్ కోహ్లి కౌంటర్‌కి పర్ఫెక్ట్ రీ కౌంటర్ ఇచ్చినట్టయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆర్సీబీ 200/4కే పరిమితమైంది. దాంతో సన్‌రైజర్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.