Kohli vs Head: ఉప్పల్‌లో హీటెడ్ మూమెంట్.. గ్రౌండ్‌లో గొడవతో కనీసం షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వని కోహ్లి

Wait 5 sec.

సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ హీటెడ్ మూమెంట్ నెలకొంది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో - మధ్య కాస్తంత మాటల యుద్ధం చెలరేగింది. అయితే, కోహ్లి ఎంతలా రెచ్చగొడుతున్నా ట్రావిస్ హెడ్ మాత్రం కామ్‌గా, నవ్వుతూనే కనిపించాడు. క్వాలిఫైయర్ 1 బెర్త్ కన్ఫార్మ్ చేసే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచినప్పటికీ పాయింట్స్ టేబుల్ టాప్ 2లోకి రాలేకపోయింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ టార్గెట్‌గా విరాట్ కోహ్లి కామెంట్స్ చేశాడు. హెడ్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలగడంతో వచ్చి బౌలింగ్ చేయి అన్నట్టు విరాట్ కోహ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పవర్ ప్లే మూడో ఓవర్‌లోనే సన్‌రైజర్స్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ చేతికి బాల్ ఇచ్చింది. ఆ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోత మోగించాడు. అదే ఓవర్‌ మధ్యలో విరాట్ కోహ్లి ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కామెంటేటర్స్ మాట్లాడిన ప్రకారం.. "రా వచ్చి బౌలింగ్ చేయి. నీకు ఆఫ్ స్పిన్ వేయడం వచ్చుగా" అన్నట్టు కోహ్లి కవ్వించాడు. అయితే, విరాట్ కోహ్లి చాలా కోపంగా, అగ్రెసివ్‌గా ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొడుతుంటే.. హెడ్ మాత్రం ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఎక్స్‌ప్రషన్స్ ఇస్తూ నిలుచున్నాడు. కోహ్లి అవుటయ్యాక హెడ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం.. ఆ తర్వాత ప్లేయర్ల షేక్ హ్యాండ్ సమయంలో కనీసం హెడ్‌ను పట్టించుకోకుండా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌కు బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రజత్ పటిదార్‌ను హెడ్ అవుట్ చేశాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన పటిదార్ బౌండరీ దగ్గర దొరికిపోయాడు. దాంతో 256 పరుగుల టార్గెట్ ముందు ఆర్సీబీ 200/4 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.