సన్‌రైజర్స్‌ బ్యాటర్లను టార్చర్ చేసిన ఆర్చర్.. SRH ఔట్.. క్వాలిఫయర్-2కు రాజస్థాన్..!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు స్కోరు చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ సూపర్ బౌలింగ్‌తో సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. 47 రన్స్ తేడాతో నాకౌట్ మ్యాచులో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్-2కు చేరుకుంది.ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే ఆర్చర్ షాక్ తగిలింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన అతడు.. సన్ రైజర్స్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.అభిషేక్ శర్మను రెండో బంతికే డకౌట్ చేసిన షాక్ ఇచ్చాడు ఆర్చర్. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 రన్స్), ట్రావిస్ హెడ్ (8 బంతుల్లో 17 రన్స్) పెవిలిన్ పంపించాడు. దీంతో సన్ రైజర్స్ ఓటమి దాదాపు ఖరారైపోయింది. హెన్రిచ్ క్లాసెన్ (18) కూడా విఫలమయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి 20 బంతుల్లో 38 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్.. 19.2 ఓవర్లలో 196 పరుగులకు కుప్పకూలింది.ఈ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌తో.. రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్-2లో తలపడనుంది. మే 29న ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మే 31న జరిగే ఫైనల్స్‌కు ఆర్సీబీ ఇప్పటికే అర్హత సాధించింది.