మ్యూచువల్ ఫండ్లతో బంపర్ రిటర్న్స్.. మే నెలలో టాప్ స్కీమ్స్ ఇవే.. లిస్టులో ఎస్బీఐ కూడా..!

Wait 5 sec.

Mutual Fund Investments: మీరు పెట్టుబడులు పెడుతుంటారా.. మరి వేటిని ఎంచుకుంటారు. అంటే మనకు ఇన్వెస్ట్ చేసేందుకు ముందు చాలానే ఆప్షన్లు కనిపిస్తుంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలనేది తెలిసుండాలి. దేంట్లో ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి.. దేంట్లో ఏ స్థాయిలో రిటర్న్స్ వస్తాయి.. రిస్క్ ఎందులో ఎలా ఉంటుంది.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్టాఫీస్ పథకాలు వంటివి రిస్క్ లేకుండానే మంచి రిటర్న్స్ ఇస్తాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటివి అనిశ్చితిలో ఉంటాయి. రిటర్న్స్ నిలకడగా ఉండవు. వీటికి ప్రత్యామ్నాయంగా స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగానే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే రాబడి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు లాంగ్ రన్ పెట్టుబడుల కోసమైతేనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్వల్ప కాలంలో రిస్క్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఇప్పుడు మే నెలలో పెట్టుబడులు పెట్టేందుకు టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏం ఉన్నాయో చూద్దాం. వీటి పెర్ఫామెన్స్ తెలుసుకునేందుకు మూడేళ్ల రాబడుల్ని ప్రాతిపదికగా తీసుకుంది ఈటీమ్యూచువల్ ఫండ్స్. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్.. 2013 నవంబరులో లాంఛ్ అయింది. గత మూడేళ్ల వ్యవధిలో ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 24.5 శాతం రిటర్న్స్ అందించింది.2009 డిసెంబరులో లాంఛ్ అయిన ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ సగటున వార్షిక ప్రాతిపదికన 23.4 శాతం రాబడి అందించింది.కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తే సగటున గత మూడేళ్లలో వార్షికంగా 25.1 శాతం రాబడి ఇచ్చింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వార్షిక ప్రాతిపదికన సగటున 31.6 శాతం రాబడి అందించింది.Disclaimer: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. అందుకే.. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.