ఏందీ బెంతాహై.. తంతాహై.. ఏపీలో ఏంటీ పంచాయితీ!

Wait 5 sec.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తోంది. అధికార, విపక్ష నేతలు సింగిల్ లైన్ పంచులు, కొత్త పేర్తలో పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. అయితే వీటికి ఆద్యుడు మాత్రం మాజీ మంత్రి, వైసీపీ నేత అని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్ రేట్లు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిరసన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు. తమ నియోజకవర్గ పరిధిలో నిరసనలు చేపట్టి.. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి, రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మంత్రి నారా లోకేష్‌కు కొత్త పేరు పెట్టారు అంబటి. నారా లోకేష్‌కి చిన్నప్పటి నుంచి డబ్బుపై ఆశ ఎక్కువన్న అంబటి రాంబాబు.. నందమూరి హరికృష్ణ స్వయంగా తనతో ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. అందుకే పేరు లోకేష్ కాదని. ఇక ఆ తర్వాతి వంతు నారా లోకేష్‌కు వచ్చింది. వైసీపీ అధినేత అడ్డా వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన నారా లోకేష్... అధికారం కోల్పోయాక వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితయ్యారన్న లోకేష్.. అప్పుడప్పుడూ తాడేపల్లి, హైదరాబాద్ వస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే జగన్‌కు కొత్త పేరు పెడుతున్నానన్న లోకేష్.. బెంగళూరు , తాడేపల్లి, హైదరాబాద్‌లలోని మొదటి అక్షరాలతో జగన్‌కు బెంతాహై అనే పేరు పెట్టారు. అయితే నారా లోకేష్‌కు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. "బెంతాహై సంగతి దేవుడెరుగు.. తెలుగు సరిగా ఉచ్చరించకపోతే ;,జనం నిన్ను తంతాహై! నారా లోకేష్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నారా లోకేష్ విదేశాల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసంగాల సమయంలో తెలుగు ఉచ్ఛరించేటప్పుడు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ విషయంలో ఈ మధ్యకాలంలో నారా లోకేష్ బాగా మెరుగుపడ్డారు. ముఖ్యంగా యువగళం పాదయాత్రలో జనంతో మమేకమైన తర్వాత నారా లోకేష్ తెలుగు ఉచ్ఛారణ చాలా మెరుగైంది. అయితే గతంలో నారా లోకేష్ తెలుగు మాట్లాడేందుకు పడిన ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.