‘ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’.. ఎన్టీఆర్ జయంతి వేళ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Wait 5 sec.

లెజండరీ నటుడు, నటసర్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు జయంతి నేడు (మే 28). ఆయన 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ తాజాగా రామారావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. సందర్భంగా చిరంజీవి ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్ని జనరేషన్స్ మారినా రామారావు ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని పేర్కొన్నారు. ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. ఆయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్’ ఇటీవల తనకు లభించించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా రామారావుతో కలిసి ఉన్న అరుదైన ఫోటోని చిరు షేర్ చేసుకున్నారు.“ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..” అని చిరంజీవి పేర్కొన్నారు.