అదానీ ఎంట్రీతో అదరగొట్టిన స్టాక్.. ఒక్కరోజే 20 శాతం జంప్.. 2 నెలల్లోనే 64 శాతం లాభాలు!

Wait 5 sec.

Trending Stock: దేశీయ మార్కెట్లు బుధవారం రోజు నష్టాల్లో మునిగిశాయి. కానీ ఒకే ఒక్క షేరు మాత్రం ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. అదే జై ప్రకాష్ పవర్ వెంచర్స్ (JP Power Ventures) షేర్లు నిన్నటి రోజున 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో రూ. 22.95 వద్ద తొమ్మిది నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఎంట్రీ ఇవ్వడమే. జేపీ పవర్ వెంచర్స్‌లో 24 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అదానీ పవర్ లిమిటెడ్ (APL) ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలతో ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబడ్డారు. పవర్ సెక్టార్‌లో అదానీ గ్రూప్ తన వాటాను మరింత పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.వేల కోట్ల డీల్జై ప్రకాష్ అసోసియేట్స్ (JAL)లోని 24 శాతం జేపీ పవర్ వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ రూ. 2,993.60 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే చుర్క్‌లో ఉన్న జేపీ గ్రూప్‌కు చెందిన 180 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌, ప్రయాగ్‌రాజ్ పవర్ జనరేషన్ కంపెనీలోని 11.49 శాతం వాటాను సైతం మరో రూ. 1,200 కోట్లతో అదానీ గ్రూప్ సొంతం చేసుకుంటోంది. దీంతో థర్మల్, హైడ్రో పవర్ రంగాల్లో అదానీ పవర్ తన వాటాని బలోపేతం చేసుకోనుంది. జేపీ పవర్ కంపెనీకి ప్రస్తుతం 2,220 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3 పవర్ ప్లాంట్లు, బొగ్గు గనులు, సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు ఉండటం అదానీకి అతిపెద్ద బలంగా మారనుంది.జేపీ పవర్ ఆదాయంగడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలుగా జేపీ పవర్ రెవెన్యూ రూ. 5,000 కోట్లన స్థిరంగా కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (FY26)లో కంపెనీ రూ. 5,563 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఎదుర్కొంది. అయితే గత 2 నెలల్లో వేగంగా పుంజుకుంది. ఈ స్టాక్ 2 నెలల్లోనే 64 శాతం మేర పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య ఈ షేరు రూ. 5.55 నుంచి రూ. 18.55 కి పెరిగి 234 శాతం లాభాలు అందించింది. గత ఐదు సంవత్సరాలు ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతూ వచ్చింది. జేపీ పవర్ షేరు పనితీరుఅదానీ వాటా కొనుగోలు వార్తలతో మే 27వ తేదీ ట్రేడింగ్ రోజున ఈ స్టాక్ భారీ ర్యాలీ చేసింది. క్రితం రోజు రూ.19.23 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 20 శాతం లాభంతో రూ.22.95 స్థాయిని తాకింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.27.70 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.13.15 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.15,660 కోట్లుగా ఉంది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.