సోషల్ మీడియాలో తన భార్యపై జరిగిన దుష్ప్రచారం గురించి చెబుతూ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎమోషనల్ అయ్యారు. టీడీపీ మహానాడులో ప్రసంగించిన ఆర్పీ.. రాజకీయాల కోసం తను భార్యను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ నీచంగా ఆమెపై ఓయో రూమ్స్ దారుణమైన ట్రోల్స్, తప్పుడు చేశారన్నారు. తన భార్య మార్ఫింగ్ ఫోటోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని.. తనకు కోపం వచ్చి అదే స్థాయిలో మాట్లాడదామనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ ఉందని.. అలా చేయొద్దని తమ నాయకుడు చెప్పారని.. ప్రతిపక్షాలు ఎంతగా దిగజారి ప్రవర్తించినా.. అధినేత చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణతోనే తాను మౌనంగా ఉన్నానన్నారు. అది పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఉన్న క్రమశిక్షణగా అభివర్ణించారు. తన భార్యపై తప్పుడు ప్రచారం చేసినా సరే సంయమనంతో ఉన్నానన్నారు. యువనేత లోకేష్ తనకు అన్ని విషయాలు స్పష్టం చెప్పారని.. బూతులు, తప్పుడు ప్రచారం మనం నైజం కాదనడంతో ఆగిపోయానన్నారు.. సోషల్ మీడియాలో పనిచేసే వారు దాన్ని ఉద్యోగంలా భావిస్తే.. టీడీపీ సైన్యం మాత్రం స్వచ్ఛంద ఉద్యమంలా చేస్తోందన్నారు. టీడీపీ సోషల్ మీడియా సైన్యం ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలను, మార్ఫింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా తిప్పికొడుతున్నారన్నారు. ప్రజల ముందు నిజాలను ఉంచుతున్నారని.. ఎంతోమంది సోషల్ మీడియాలో వేదికగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ కుప్పానికి నీళ్లు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తే.. టీడీపీ సోషల్ మీడియా సైన్యం ఒకే ఒక్క వీడియోతో వాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందన్నారు. సోషల్ మీడియా వేదికగా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు టీడీపీ సైన్యం పనిచేస్తోందన్నారు ఆర్పీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన పునర్విక విషయం, స్కూళ్లలో సమస్యలు, గల్ఫ్‌లో మహిళల కష్టాలు.. ఇలా సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన వెంటనే యువనేత లోకేష్ వెంటనే స్పందించి ఎంతోమందికి సాయం చేశారన్నారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ సైన్యం చంద్రబాబు చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందరు కలిసి ముందుకుసాగుతూ 2029 ఎన్నికల్లోనూ తెలుగుదేశం జెండా ఎగరేద్దామన్నారు. అందరం కలిసి ఇదే ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ హయాంలో తన భర్త రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని ఏకంగా 23 కేసులు పెట్టారని నెల్లూరు జిల్లాకు చెందిన మహిాళా కార్యకర్త కప్పిర రేవతి మహానాడులో చెప్పుకొచ్చారు. ఆయనపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపారని.. బెయిల్ వచ్చినా సరే మళ్లీ వేరే కేసులో జైలుకు పంపేవారన్నారు. తనపై కూడా 16 కేసులు పెట్టారని.. ఆ సమయంలో అధినేత చంద్రబాబు తమకు అండగా నిలిచారన్నారు.