: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నలుగుతున్న నాయకత్వ మార్పు వ్యవహారం గురువారం అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. రాష్ట్రంలో అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ.. ఏ నిబంధనల ఆధారంగా ఈ మార్పు జరగాలనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే అధిష్ఠానం ఆలోచనకు గట్టి బ్రేక్ పడింది. ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించడంపై సిద్ధరామయ్య తీవ్ర విముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది.రాష్ట్ర రాజకీయాల్లోనే సిద్ధరామయ్య..!ముఖ్యంగా సీఎంగా రాజీనామా చేస్తే సిద్ధరామయ్యకు.. రాజ్యసభ సీటుతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండగా.. ఆ స్థానంలో సిద్ధూను కూర్చోబెట్టనున్నట్టు తెలిసింది. కానీ సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇందుకు నో చెప్పారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధూ రాబోయే రెండేళ్ల పాటు కర్ణాటకలోనే శాసన సభ్యుడిగా కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఈ అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన విషయాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ముఖాముఖి భేటీ అయి.. తన వర్గానికి జరగాల్సిన న్యాయంపై పట్టుబట్టనున్నారు.కాంగ్రెస్ కార్యాలయాల్లో జోరందుకున్న చర్చలు..ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బెంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు, కీలక నేతల నివాసాలు గురువారం ఉదయం నుంచే తీవ్రమైన చర్చలు, సమాలోచనలతో హీటెక్కాయి. శరవేగంగా మారుతున్న సమీకరణాల మధ్య.. సిద్ధరామయ్య గురువారం చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది.శనివారమే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం..?మరోవైపు డీకే శివకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడబోయే శివకుమార్ మంత్రివర్గంలో సిద్ధరామయ్యకు అత్యంత నమ్మకస్తులైన ముఖ్య అనుచరులకు, ఎమ్మెల్యేలకు కీలకమైన మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరి.. ఎలాంటి విబేధాలు లేకుండా ప్రభుత్వం సాగాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ఈ సమతూకాన్ని పాటిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో ఢిల్లీ వేదికగా జరిగే చర్చలతో కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.