"నా కలలో కూడా ఇలా ఆడలేను.. వైభవ్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా".. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసానికి సన్‌రైజర్స్ ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం భయపెట్టిన వైభవ్ సూర్యవంశీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆకాశానికి ఎత్తాడు. గతంలోనే వైభవ్‌కు అభిమానిని అని ప్రకటించిన కమిన్స్.. ఈ సారి అతనిలా కలలో కూడా ఆడలేనంటూ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ "వైభవ్ సూర్యవంశీ ఓ జీనియస్. ఈ వయస్సులో అలా ఆడటాన్ని కనీసం నేను ఊహించలేకపోతున్నాను.. నా కలలో కూడా వైభవ్‌లా ఆడలేను. ఈ రోజు వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆడ చాలా గొప్పది. నేను ఇప్పటికే అతని అభిమానిని.. రోజురోజుకు అతనికి గొప్ప అభిమానిగా మారిపోతున్నాను" అని అన్నాడు.సన్‌రైజర్స్‌పై వైభవ్ ఆడిన తీరుకు అతనికే పూర్తి క్రెడిట్ ఇవ్వాలని ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఎందుకంటే అతనికి యార్కర్లు మిస్సయితే అవి సిక్సర్లే వెళ్తున్నాయని, ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఉండవని, బ్యాటింగ్‌కి అనుకూలమైన పిచ్ అయినప్పటికీ వైభవ్ ఆడిన తీరు ప్రశంసనీయమని క్రెడిట్ ఇచ్చాడు.మ్యాచ్ ఓటమి గురించి మాట్లాడిన కెప్టెన్ కమిన్స్ ఈ జట్టు చాలా బాగా ఆడిందన్నాడు. యువ ఆటగాళ్లను సెలెక్ట్ చేసి ప్లే ఆఫ్స్ వరకూ తీసుకు రావడం కోచింగ్ స్టాఫ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే అన్నాడు. "మా జట్టు చాలా బ్యాలెన్సింగ్‌గా ఉంది. ఫ్రఫుల్, సాకిబ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ యువ ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా ప్లే ఆఫ్స్‌కి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లలో యువ ఆటగాళ్లతో ఉన్న టీమ్స్‌లో తమదీ ఉండటం సంతోషంగా ఉంది" అని అన్నాడు.భారీ టార్గెట్ ఛేజింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లు కోల్పవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని కమిన్స్ చెప్పాడు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పోరాడమని చెప్పుకొచ్చాడు. టాప్ 2లో ఉండేందుకు చాలా ప్రయత్నించాం.. ఈ ఏడాది తమ ఆటగాళ్ల ఆటను ఆస్వాదించానని, కెప్టెన్‌గా అంతకంటే ఎక్కువ కోరుకోను అంటూ కమిన్స్ ముగించాడు.