లో ఆరెంజ్ ఆర్మీ ప్రస్థానం ముగిసింది. ఆరంభంలో తడబడిన .. ఆ తర్వాత నుంచి పుంజుకుని ఎవ్వరి సాయం లేకుండానే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. 2024లో ఫైనల్ బరిలో నిలిచిన సన్‌రైజర్స్.. ఈ ఏడాది కూడా అక్కడి వరకూ చేరుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు ఎలిమినేటర్ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఈ ఏడాది సన్‌రైజర్స్ ప్లేయర్స్ చూయించిన క్లాస్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై ఘన విజయం సాధించి.. ప్లే ఆఫ్స్‌లో కూడా అదే జోష్ కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన ఝలక్‌కు ఇంటిదారి పట్టక తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈ ఏడాది విధ్వంసమే సృష్టించారని చెప్పొచ్చు. ముఖ్యంగా మిడిలార్డర్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ నాన్ ఓపెనర్‌గా 600 పరుగుల మైలురాయిని దాటేశాడు. క్లాసెన్, ఇషన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో రాణిస్తే.. యువ బౌలర్లు సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే సీజన్ మధ్యలో నుంచి ఎంట్రీ ఇచ్చినా జట్టుకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇషాన్ మలింగ నమ్మకమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. స్పిన్నర్లు శివాంగ్ కుమార్, హర్ష్ దూబే కూడా రాణించడం విశేషం. హెన్రిచ్ క్లాసెన్ 15 మ్యాచ్‌లలో 624 పరుగులతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఐపీఎల్‌లో టాప్ 3 బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా 600 మైలురాయిన దాటి 602 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 563 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ 410 పరుగులు చేశాడు. ఇక తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నితీష్ కుమార్ రెడ్డి మెరుగుపడటంతో సన్‌రైజర్స్‌తో పాటు టీమిండియాకు కూడా కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో నితీష్ 302 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇషాన్ మలింగ అత్యధికంగా 20 వికెట్లు పడగొట్టాడు. సాకిబ్ హుస్సేన్ 15, ప్రఫుల్ హింగే 14 వికెట్లు తీసుకున్నారు. శివాంగ్ కుమార్ 9 వికెట్లు తీసుకోగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8, హర్ష్ దూబే 8 వికెట్లు తీసుకున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సన్‌రైజర్స్ చూపిన ప్రతిభకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.