ఎన్నో ఆశలతో ఎలిమినేటర్‌లో అడుగుపెట్టిన . విధ్వంసంతో చిన్నబోయిన సన్‌రైజర్స్ ఓనర్ మొహం.. మ్యాచ్ పూర్తయ్యే వరకూ అలానే ఉంది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ఆమె క్రీడా స్ఫూర్తిని చాటుకుంది. వైభవ్ సూర్యవంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా అభినందించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌‌రైజర్స్ బౌలర్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. దాంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 243/8 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో 196 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్ 2లో అడుగుపెట్టింది.మ్యాచ్ ముగిసిన వెంటనే కావ్య మారన్ మైదానంలోకి వచ్చి వైభవ్ సూర్యవంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత వైభవ్‌తో కాసేపు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కావ్య మారన్ క్రీడా స్ఫూర్తిని అభినందిస్తూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే, మ్యాచ్ జరగుతున్నంత సేపూ కావ్య మారన్ మొహంలో అసలు నవ్వే లేదు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో క్లాసెన్ వికెట్ పడిన తర్వాత పూర్తిగా నిరుత్సాహ పడిపోయింది. మే 19న లక్నో‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన వైభవ్ తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం .రాజస్థాన్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఐపీఎల్ కెమెరామెన్లు కావ్య మారన్‌నే ఎక్కువగా ఫోకస్ చేశారు. వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొడుతుంటే పదే పదే ఆమె రియాక్షన్‌ను చూపెట్టే ప్రయత్నం చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం, ఛేజ్‌లో వరుస వికెట్లు పడిపోవడంతో ఆమె తీవ్ర నిరాశలో కనిపించింది. జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వికెట్లు తీయడంతో 5 ఓవర్లకే సన్‌రైజర్స్ 57/4తో కష్టాల్లో పడింది. అప్పటి నుంచి కావ్య మారన్‌పై ఫోకస్ ఇంకాస్త ఎక్కువైంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమితో క్యావ మారన్ కెమెరాలకు కనిపించకుండా ఉండటం కోసం వెనక్కి తిరిగి ఏడ్చేశారు. అయితే, మ్యాచ్ అనంతరం వైభవ్‌ను అభినందించిన ఆమె క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.