Calculator: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్లు మన నిధుల్ని స్టాక్ మార్కెట్లలోని ఆయా రంగాల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే.. కాంపౌండింగ్ కారణంగా ఇక్కడ కాలం గడుస్తున్న కొద్దీ మంచి రాబడి ఉంటుంది. అదే సమయంలో రిస్క్ ఫ్యాక్టర్‌ను తగ్గిస్తుంది. ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తేనే కాంపౌండింగ్ బెనిఫిట్ పొందొచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇక మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి చేయొచ్చు లేదా సిప్ అంటే నెలకు, 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి ఇలా చిన్న మొత్తాల్లో కూడా సిప్ రూపంలో క్రమానుగత పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరి ఆర్థిక లక్ష్యాలు, స్థోమతకు అనుగుణంగా వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. కచ్చితంగా ఇంతే ఇన్వెస్ట్ చేయాలని ఏం ఉండదు. సిప్ విషయంలో కనీసం రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుండగా.. గరిష్ఠ పరిమితి లేదు. ఎంతైనా పెట్టొచ్చు.ఇప్పుడు సిప్ రూపంలో పెట్టుబడి పెడుతూ ఓపికతో ఎదురుచూసిన వారికి దీర్ఘకాలంలో మంచి రాబడి అందించిన ఒక టాప్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే . నిర్వహణలోని ఆస్తుల పరంగా చూస్తే.. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద యాక్టివ్ ఫండ్లలో ఒకటిగా ఉంది. మే 28 నాటికి ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 13 ఏళ్లలో రూ. 51 లక్షలు వచ్చాయి. ఈ మేరకు ఈటీమ్యూచువల్ ఫండ్స్ డేటా చెబుతోంది. వాల్యూరీసెర్చ్, మార్నింగ్ స్టార్ రెండింటి నుంచి ఇది 5 స్టార్ రేటింగ్ పొందడం విశేషం. 2026, ఏప్రిల్ 30 నాటికి ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ సరిగ్గా రూ. 1.40 లక్షల కోట్లుగా ఉంది. మార్చి నాటికి చూస్తే కేవలం రూ. 1.28 లక్షల కోట్లుగానే ఉండగా.. నెలలో రూ. 12 వేల కోట్లకుపైగా సంపద పెరిగింది.ఇక పదేళ్లలో రూ. 10 వేల సిప్.. రూ. 29.25 లక్షలుగా మారింది. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన సగటున 17.02 XIRR రిటర్న్స్ అందుకున్నారు. అదే ఐదేళ్ల కాల వ్యవధిలో చూస్తే రూ. 10 వేల సిప్‌ను రూ. 8.21 లక్షలుగా చేసింది. మూడేళ్ల కాల వ్యవధిలో సగటున 8.04 శాతం రిటర్న్స్ ఇవ్వగా చేసిన వారికి రూ. 4.05 లక్షలు వచ్చాయి. ఈక్విటీ, ఈక్విటీ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తూ.. దీర్ఘకాలంలో అధిక రాబడి అందించడమే లక్ష్యంగా ఈ ఫండ్ ఉందని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. లంప్ సమ్ విషయానికి వస్తే రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 13 ఏళ్లలో రూ. 8.29 లక్షలు వచ్చాయి. పదేళ్లలో లక్షను రూ. 4.83 లక్షలుగా చేసింది. ఐదేళ్లలో మాత్రం లక్షకు రూ. 1.99 లక్షలు వచ్చాయి.Disclaimer: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.