సినీ దిగ్గజం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గార్డెన్ వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన మనవడు, సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా నివాళులు అర్పించారు. ఇవాళ గురువారం (మే 28) ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకొని తారక్ తన తాతకు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినమ్రంగా నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చొని తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాక నేపథ్యంలో 'ఎన్టీఆర్‌ ఘాట్‌' వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని తారక్ కు చెయ్యి ఇవ్వబోయి కింద పడ్డాడు. భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు లాగేసేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''మీ పాదం ,మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూప కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..'' అని తారక్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.