తెలంగాణలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి 2 వేలు, జూన్ 1న మంజూరు

Wait 5 sec.

శనివారం తెలంగాణ సీఎం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో 2.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. జూన్‌ 1వ తేదీన రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 2 వేల చొప్పున రెండో విడత ఇళ్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్క క్యూర్‌ పరిధిలో పేదలకు లక్ష ఇళ్లు ఇవ్వాలని భావిస్తోంది. అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ వేగవంతం.. గోదావరి పుష్కరాలకు రూ.వెయ్యి కోట్లు, జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం, విద్యుత్‌ ఆర్డీఎస్‌ఎస్‌ పథకం అమలు చేయనున్నట్లు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణను పూరిగుడిసెలు లేకుండా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జూన్‌ 1వ తేదీ నుంచి రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొలి విడత ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది. అదే సమయంలో కొలాం ఆదివాసీలకు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్‌ 1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వేల ప్రకారం తెలంగాణలో 15 వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నారని.. వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసి, పూర్తి కాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించనున్నట్లు పేర్కొ్న్నారు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు వేయని ఇళ్లకు రూ.3 లక్షలు.. గోడలు పూర్తయి, శ్లాబు వేయాల్సిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని తేల్చి చెప్పారు. ఇలాంటి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి నియోజకవర్గానికి 500 ఇళ్లకు త్వరలోనే నిధులను కేటాయిస్తామని తేల్చి చెప్పారు. ఇక సొంత స్థలాలు ఉన్న వారికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. 2030 నాటికి తెలంగాణను 5 ప్రపంచ శ్రేణి లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. నెక్ట్స్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026-30ని కేబినెట్ ఆమోదించింది. లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చనున్నారు. పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కావాల్సిన భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.