అప్పుడే నాకు ఛాన్స్ వచ్చింది.. సీఎం అయ్యేవాడిని కదా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wait 5 sec.

కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడ్ని జైల్లో వేయాలని అడిగానని ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేరం చేసిన వాళ్లను జైలుకు పంపాలని తాను చెప్పాలా అని ప్రశ్నించారు. అందుకు వ్యవస్థలు, ఏసీబీ కోర్టులు లేవా అన్నారు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తాము చెప్పాలా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ వ్యవస్థల్ని అవమానించడం అన్నారు. కొంతమందితో ఇలా చెప్పించి వాళ్లు ముఖ్యమంత్రులు అవుదామనుకుంటున్నారేమో కానీ తాను మాత్రం కాదన్నారు. , ఒకరు జైలుకు వెళితే ఎదుగుతుందా.. తనకు అలాంటి మైండ్ సెట్ లేదన్నారు. ఒకవేళ తనకు అలాంటి మైండ్‌సెట్‌ ఉంటే.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అదే సరైన సమయమని భావించేవాణ్ని కదా అన్నారు . కానీ అది తన నీతి కాదని.. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కాదు.. బలంగా ఉన్నప్పుడే కొడతానన్నారు. అలాగైతే అప్పుడే సీఎం అవ్వాలనుకునేవాణ్ని కదా అన్నారు. 'అలాంటి తెలివితేటలు నాకుంటే.. చంద్రబాబు జైలులో ఉన్నపుడు ఇదే సరైన సమయమని పాలిటిక్స్‌లో ముందుకెళ్లిపోతే ముఖ్యమంత్రి అయిపోవచ్చని నేను అనుకోవచ్చు కదా.. పాజిబులిటీ ఉంది కదా! అలా అనుకుంటే అయిపోతామా? ఏమో జరగొచ్చు.. జరక్కపోవచ్చు. కానీ నా నైతిక ఆలోచన అదికాదు. ధైర్యంగా నిలబడి శత్రువు బలంగా ఉన్నప్పుడే బలంగా కొడతాను. బలహీనంగా ఉన్నపుడు కాదు' అన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న తుపాకీ సరెండర్‌ చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక కూడా ధైర్యంతో బలంగా నిలబడ్డానన్నారు. తాను అమిత్ షాతో దేశ భవిష్యత్తు, ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడతాం కదా అన్నారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్‌ను అందరి ఎదుగుదలకు వాడుకున్నారని.. తాను సహనంతో భరించానన్నారు. తాను ఎప్పుడూ గెలుపోటములకు భయపడలేదని.. ఎవరినో ఏదో అంటే ఓట్లు పోతాయనుకుంటే ఎలా అన్నారు. జనసేన పార్టీపై దారినపోయే వారెవరో రాళ్లు వేస్తామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కొన్ని టీవీ ఛానళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే, ఊరికే విమర్శలు చేస్తామంటే ఊరుకునేది లేదని, ఎదురు దాడి చేస్తామన్నారు. తాను మౌనంగా ఉన్నానంటే గట్టి పడుతున్నట్లు అర్థమన్నారు. తాను సరైన సమయం కోసం చూస్తున్నానన్నారు. ఒకవేళ మనం ఏదైనా అంశంపై గొడవ పడితే.. ఆ అంశం సరైనదని అందరూ ప్రశంసించాలన్నారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వంపై కొట్లాడారని, పోరాటం చేశారని.. అది కూడా గెలుపు కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం పోరాడారన్నారు పవన్ కళ్యా్.. మళ్లీ ఆ తెగువ ఉండాలన్నారు. జనసేన పార్టీ నేతలకు పదవులు ఇస్తే చప్పబడిపోయారని.. అలాంటి వారు జనసేన పార్టీకి అక్కర్లేదన్నారు. తనకు ఇంకా పౌరుషం పోలేదని.. కొట్లాడే గుణం పోలేదన్నారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బలంగా సిద్ధం కావాలని.. ఏయే స్థానాల్లో జనసేన గెలిచే అవకాశం ఉందో పార్టీ నేతలకు చెప్పాలి అన్నారు.