కీలక నిర్ణయం తీసుకుంది.. ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నిర్ణయంతో జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌తో పాటు మొత్తం కమిటీ రద్దయ్యింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి నుంచి వివరణ తీసుకోవాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించారు. కేంద్ర కార్యాలయం ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని.. కొత్త కమిటీ ఏర్పాటు చేసే వరకు కేంద్ర కార్యాలయం చూసుకుంటుందని తెలిపారు. ఉమ్మడి అధ్యక్షుడిగా ఉన్న రియాజ్.. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల బాలినేనికి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ డీలిమిటేషన్‌ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలులో బాలినేని నిర్వహించిన సమావేశానికి రియాజ్ హాజరుకాలేదు. ఇటీవల బాలినేనితో ఆ పార్టీ నేత జడా బాలనాగేంద్రంకు విభేదాలు మొదలయ్యాయి.. బాలినేని పదవులు అమ్ముకుంటున్నారంటూ బాలనాగేంద్రం ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ కళ్యాణ్.. తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కమిటీలను రద్దు చేశారు. ఆగస్టు 14వ తేదీనాటికల్లా జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా సన్నాహాలు మొదలుపెట్టామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా కమిటీలు నియామకం ఉంటుంది. పార్లమెంటువారీగా కమిటీలు పంపిస్తామనన్నారు. ఆగస్టు 15వ తేదీన నియమించిన కొత్త కమిటీలు ప్రతి నియోజకవర్గంలో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసుకోవాలన్నది తన ఆకాంక్షన్నారు. ప్రతి పార్లమెంటు కమిటీలో అవగాహన ఉన్న నాయకుల్ని, తన మాట వినే కొంతమందిని పంపుతాను అన్నారు. వారితో పాటు కనీసం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి వెన్నంటే ఉన్న సాధక్, నిలకడగా సభ్యత్వాలు చేసిన మరో ముగ్గురిని, పార్టీకి పని చేసి స్థానిక రాజకీయాలపై అవగాహన ఉన్న మరి కొందరు ఉంటారని చెప్పారు. 'ప్రతి నియోజకవర్గంలోనూ ఎంత మంది సాధక్‌లు ఉన్నారు.. ఎంత మంది నాయకులు ఉన్నారు. వారు ఏం పని చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. పార్టీలో మీరు చేసిన పని తాలూకు వివరాలు ఈ కమిటీకి ఇవ్వండి. కమిటీకి సహకరించేందుకు 20 మంది సాధక్స్ ని పెడతాను. ఎవరు పని చేశారో తెలుసుకోవడానికి నాయకుల్ని పంపడం లేదు. పని చేసిన 20 మంది సాధక్ లను పంపుతున్నాను. ఆ కమిటీ కేంద్ర కార్యాలయానికి ఆ వివరాలు అందిస్తుంది. వాటిని పారదర్శకంగా పరిశీలన చేసి అందరి ఆమోదయోగ్యంతో ఇంఛార్జ్, కోశాధికారిగా ఇలా పార్టీ నిర్మాణం చేపడతాం. వ్యూహం నేను వేస్తాను. మీరు పాటించండి. ఇప్పటి వరకు పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళ్లడానికే ప్రయత్నం చేశాను' అన్నారు.