: .. తన వ్యాపారాల్లో బిజీ అయ్యారు. తన ఫ్యామిలీ సంస్థ.. అమర రాజా గ్రూప్‌ను ముందుండి నడిపిస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన జయదేవ్.. ప్రస్తుతం అమర రాజా గ్రూప్ కో ఫౌండర్, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా తన గ్రూప్ సంస్థ.. ఆటోమోటివ్ బ్యాటరీ మేకర్ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ.. 2025-26 ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. ఇక్కడ జనవరి- మార్చి త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ. 314.3 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇదే సమయంలో లాభం రూ. 161.6 కోట్లుగా ఉండగా.. వార్షిక ప్రాతిపదికన చూస్తే లాభం ఏకంగా 95 శాతం పెరగడం విశేషం. దాదాపుగా రెట్టింపు స్థాయిలో ప్రాఫిట్స్ వచ్చాయన్న మాట. ఇదే సమయంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి రూ. 3,535.8 కోట్లుగా నమోదైంది. ఏడాది కిందట ఇదే సమయంలో ఆదాయం రూ. 3060.1 కోట్లుగా ఉండేది. ఎబిటా 13.1 శాతం పెరిగి రూ. 385.5 కోట్లకు చేరుకుంది. ఎబిటా మార్జిన్ 10.9 శాతానికి తగ్గింది. అంతకుముందు 11.14 శాతంగా ఉండేది. చివరి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన సమయంలోనే అమర రాజా ఎనర్జీ సంస్థ.. ఫైనల్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. రూ. 1 ముఖ విలువ ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5.20 చొప్పున తుది డివిడెండ్ చెల్లించనున్నట్లు పేర్కొంది. ఇది దాదాపు 520 శాతానికి సమానం. తమ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్ల ఆమోదానికి అనుగుణంగా డివిడెండ్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించింది. 30 రోజుల్లోపు పేమెంట్స్ చేస్తామని తెలిపింది. అంతకుముందు 2025, నవంబర్ 6న రూ. 5.40 చొప్పున మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సోమవారం సెషన్‌లో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు రాణించాయి. అంతకుముందు రూ. 820.65 వద్ద క్లోజ్ అవగా.. సోమవారం రోజు మొదట ఒక శాతం లాభంతోనే ప్రారంభమైనా ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 9 శాతం పెరిగి రూ. 897.50 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8 శాతానికిపైగా లాభంతో రూ. 886.80 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 15.02 వేల కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ఠ ధర రూ. 1094 కాగా.. కనిష్ఠ ధర రూ. 670 గా ఉంది. . ఇందులో భాగంగా సుమారు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.