. లీగ్ స్టేజ్‌ పూర్తి చేసుకున్న ఐపీఎల్ 2026, ఇక ప్లే ఆఫ్స్‌కు సిద్ధమైంది. టాప్ 2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఓడిపోయిన జట్టుకు ఫైనల్ చేరుకునేందుకు మరొక అవకాశం ఉంటుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇవాళ క్వాలిఫైయర్ 1 జరగనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్‌లో ఆర్సీబీ - గుజరాత్ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 8 సార్లు తలపడితే ఇరు జట్లు పోటాపోటీగా ఆడాయి. నాలుగు మ్యాచ్‌లలో ఆర్సీబీ, నాలుగు మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాయి. ఈ ఏడాది ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగితే బెంగళూరులో ఆర్సీబీ విజయం సాధించగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఆర్సీబీలో ఒక కీలక మార్పు చోటుచేసుకోనుంది. చివరి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్న జేకబ్ బెతెల్ వేలి గాయంతో సీజన్ నుంచి బయటకు వెళ్లాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ భారత్‌కి వచ్చినప్పటికీ ప్లేయింగ్ 11లో ఆడటం కష్టమేనని కెప్టెన్ రజత్ పటిదార్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అసలైన పోరు భువనేశ్వర్ కుమార్ వర్సెస్ గిల్, సుదర్శన్, బట్లర్‌‌గా సాగే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అంచనావెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, జోష్ హేజిల్‌వుడ్, సూయాశ్ శర్మ / జేకబ్ డప్ఫీ. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధూ, రషిద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.